Prabhas : హమ్మయ్య ! ఆదిపురుష్ నుంచి అందరు ఎదురు చూస్తున్న ఆ అప్డేట్ వచ్చేసింది

మొదట్లో ఏ మాత్రం అంచనాలు లేకుండా ఉన్న ఆదిపురుష్ సినిమా, రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ తో ప్రేక్షకులందరిని ఆకట్టుకుంది. గ్రాఫిక్స్ విషయంలో గతంలో చాలా విమర్శలు ఎదుర్కొన్న ఆదిపురుష్ మూవీ టీం, టీజర్ తరువాత గ్రాఫిక్స్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని బెస్ట్ క్వాలిటీ తీసుకొచ్చారని ట్రైలర్ ద్వారా తెలుస్తుంది.

ప్రభాస్ హీరోగా, తాన్హాజీ ఫేం ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా, వాల్మీకి రాసిన రామాయణ ఇతిహాసం ఆధారంగా తీశారు. రాముడిగా ప్రభాస్ నటించగా, జానకిగా కృతి సనన్ నటించింది. బాలీవుడ్ అగ్ర నటుడు సైఫ్ అలీ ఖాన్ సినిమాలో రావణుడిగా కనిపించబోతున్నారు. ఇటివలనే ట్రిబెకా ఫిలిం ఫెస్టివల్ కి సెలెక్ట్ అయిన ఈ సినిమా మీద రోజు, రోజుకి అంచనాలు పెరుగుతున్నాయి.

ఇదిలా ఉండగా ఆదిపురుష్ సినిమాపై ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ చేసిన జై శ్రీ రామ్ పాటని కాసేపటి క్రితం రిలీజ్ చేసారు. అయితే ఈ పాటపై మొదటి నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. జై శ్రీరాం.. జై శ్రీరాం.. అంటూ సాగే ఈ పాటని గతంలో మోషన్ పోస్టర్ తో పాటు 1మినెట్ సాంగ్ రిలీజ్ చేయగా, అందరు ఫుల్ సాంగ్ కోసం వెయిట్ చేసారు. అయితే సినిమా రిలీజ్ దగ్గరికి వస్తుండటంతో.. జై శ్రీ రాం ఫుల్ సాంగ్ ని విడుదల చేసారు. అజయ్, అతుల్ మ్యూజిక్ అందించగా మ‌నోజ్ ముంతాషిర్ శుక్ల లిరిక్స్ రాసారు. తెలుగులో ఈ లిరిక్స్ ని రామజోగయ్య శాస్త్రి అనువదించారు.వచ్చే నెల జూన్ 16 న ఆదిపురుష్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ అవబోతుంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు