Biggboss Telugu: అరెస్ట్ పై స్పందించిన హిమజ!

టెలివిజన్ లో బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన హిమజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించి, బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా పాపులర్ అయ్యి, ఇప్పుడు సినిమాల్లో కూడా నటిస్తున్న ప్రస్తుతం ఓ వివాదం లో చిక్కుకున్న విషయం తెలిసిందే. చిత్ర పరిశ్రమకు చెందిన కొంతమంది ఫ్రెండ్స్ తో కలిపి ఆమె రేవ్ పార్టీ చేసుకుంటున్నారని, అయితే ఆ పార్టీ లో కొన్ని ఇల్లీగల్ వస్తువులు ఉన్నాయని సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే వెళ్లి అరెస్ట్ చేసారని న్యూస్ వచ్చింది.

అయితే ఈ విషయంపై తాజాగా హిమజ స్పందిస్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియో లో తన ఇంట్లో ఉండి మాట్లాడుతూ, ఎవరో ఒకరు తప్పుడు సమాచారం పోలీసులకి ఇచ్చారని, వాళ్ళు వచ్చి చెక్ చేసారని, పోలీసులకి బాగా సహకరించమని హిమజ అంది. అంతే కాకుండా ఇది తప్పుడు ఇన్ఫర్మేషన్ అని, కొత్త ఇంట్లో దీపావళి ని ఫ్రెండ్స్ తో సెలెబ్రేట్ చేసుకుంటే, కొందరు వేరే రేవ్ పార్టీ అని అనుకుని పోలీసులకి సమాచారం ఇచ్చారు.

అయితే ఎవరికీ సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం తనకి లేదని, తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కంగారు పడకూడదని ఈ వీడియో చేశానని పేర్కొంది. ఇక ఎంతో సంతోషంగా దీపావళి సెలెబ్రేట్ చేసుకుంటుంటే ఇలా జరగడం బాధగా ఉందని వీడియో లో పోస్ట్ చేసింది. ఇక హిమజ తో కలిసి తనతో పాటు పలువురు బిగ్ బాస్ 4 ఫ్రెండ్స్ , అలాగే జబర్దస్త్ కి చెందిన నటులు కూడా ఈ పార్టీ లో పాల్గొనడం జరిగింది. ఇక హిమజ పోస్ట్ చేసిన ఈ వీడియో లో నెగిటివ్ స్ప్రెడ్ చేసిన కొన్ని టీవీ ఛానళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేసింది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు