Bigg Boss Telugu: సిటీ శివారులో రేవ్ పార్టీ… బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌తో సహా 12 మంది అరెస్ట్

బిగ్ బాస్ బ్యూటీ హిమజను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీ నిర్వహించారు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మొత్తం పన్నెండు మందిని అదుపులోకి తీసుకున్నారు. కాగా వారిలో హిమజ కూడా ఉన్నట్టు సమాచారం. అంతే కాకుండా మిగితా పదకొండు మంది కూడా చిత్రపరిశ్రమకు చెందినవారే అని తెలుస్తోంది.

అరెస్ట్ చేసిన వారిలో హిమజతో పాటూ మరికొందరు బిగ్ బాస్ లో వచ్చినవారు ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం వీరంతా పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా హిమజ గతంలో టీవీ సీరియల్స్ లో నటించిన సంగతి తెలిసిందే. ఆ తరవాత సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లలో నటించింది. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తరవాత తన ఆటిట్యూడ్ మరియు అందంతో అభిమానులను సంపాదించుకుంది.

ఈ బ్యూటీ బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తరవాత సినిమా అవకాశాలను కూడా ఎక్కువగానే అందుకుంది. సినిమాలతో పాటూ టీవీలో యాంకర్ గానూ సందడి చేస్తోంది. ఇక హిమజ స్వస్థలం తెనాలి కాగా హైదరాబాద్ లో స్థిరపడింది. సినిమాల్లోకి రాకముందు సోషల్ టీచర్ గా పిల్లలకు పాఠాలు చెప్పడం విశేషం. ఓ వైపు టీచర్ గా పనిచేస్తూనే మరోవైపు మోడలింగ్ వైపు దృష్టి పెట్టింది.

- Advertisement -

దాంతో సీరియ‌ల్స్, యాంక‌రింగ్ లో అవ‌కాశాలు అందుకుంది. ఆ త‌ర‌వాత బిగ్ బాస్-3లో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ కొట్టేసింది. అయితే కెరీర్ ప్రారంభం నుండి ఈ బ్యూటీపై ఎలాంటి మ‌చ్చ‌లు లేవు. కానీ తాజాగా రేవ్ పార్టీలో దొరికిపోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. మ‌రి ఈ ఘ‌ట‌న హిమ‌జ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు