Sandeep Reddy Vanga: యానిమల్ ఈజ్ రెడీ టూ మీట్ లయన్

అన్ స్టాపబుల్ ఈ షో గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్టుగా చేసిన ఈ షో ఎంత పెద్ద హిట్ అయిందని కొత్తగా చెప్పక్కర్లేదు. మొదటి సీజన్ తోనే మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ షో, రెండో సీజన్ తో ఒక మరింత హైప్ ను ప్రేక్షకులకు ఇచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలు కూడా ఈ షోలో కనిపించి ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అల్లు అర్జున్ లు కూడా ఈ షోలో కనిపించి ప్రేక్షకులను అలరించారు. ఈ షో తర్వాత నందమూరి బాలకృష్ణను చూసే విధానం మారిపోయిందని చెప్పొచ్చు. నందమూరి బాలకృష్ణ ఆడియోన్స్ ని కొడతారు. దురుసుగా ప్రవర్తిస్తారు. అంటూ కొన్ని వార్తలు వినిపించాయి. కానీ ఈ అన్ స్టాపబుల్ షో తో బాలయ్యలోని వ్యక్తిత్వం అంతా బయటపడింది.

బాలయ్య అవతల వారిని ఎంతగా ప్రేమిస్తారు. అవతల వాళ్ళతో ఎంతగా కలిసిపోతారు అని చూపించిన షో అన్ స్టాపబుల్. ఈ సినిమా తర్వాతే బాలయ్య కెరియర్లో హిట్ సినిమాలు కూడా వచ్చాయి. అన్ స్టాపబుల్ తర్వాత బాలయ్యను చూసిన విధానం మారిపోయింది. ఇప్పుడు సీజన్ 3 మొదలైంది. ఈ షో కి అనిమల్ టీం హాజరుకానున్నట్లు అఫీషియల్ గా ప్రకటించింది ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్.

- Advertisement -

రష్మిక మందన్న, రన్బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగ ఈ షోలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. మామూలుగా తెలుగును అవపోషణ పట్టిన బాలయ్య బాబుకి హిందీ మీద కూడా మంచి గ్రిప్ ఉంది. బాలయ్య హిందీ మాట్లాడితే వినడానికి వినసొంపుగా ఉంటుంది. ఇప్పుడు రన్బీర్ కపూర్ తో ఏ రేంజ్ లో హిందీ మాట్లాడుతారు షో లో తెలియనుంది. అర్జున్ రెడ్డి సినిమాతో ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగ చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు.

కానీ మొదట బాలయ్య బాబుతో కూర్చొని ఏం మాట్లాడారు అనేది అందరిలో ఒక క్యూరియాసిటీ నెలకొంది. ఏదేమైనా సీజన్ వన్, సీజన్ 2 తర్వాత ఇంకా చేయడానికి ఏమి ఉంటుందిలే అనుకున్న తరుణంలో తెలుగు ఇండస్ట్రీని దాటి బాలీవుడ్ వాళ్లను కూడా ఈ షోలో కూర్చొని పెట్టే ప్రయత్నం చేశారంటే సాహసం అనే చెప్పాలి. మొత్తానికి అనిమల్ టీం లయన్ ని కలవనున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

Checkout Filmify Telugu for bollywood news today, latest Movie Reviews & Ratings, and all the Entertainment News. Get the latest celebrity news updates, and the latest news in Tollywood here at Filmify. Also, grab Filmify for the latest movie release dates, OTT updates & Tollywood gossip news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు