నట సింహం నందమూరి బాలకృష్ణకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలయ్య సినిమా వచ్చిందంటే చాలు అభిమానులు రెండు మూడు సార్లు చూస్తుంటారు. ఇక మంచి మాస్ బిర్యానీ లాంటి సినిమా కావాలంటే బాలయ్య సినిమాకే వెళ్లాలి. అయితే బాలయ్య హీరోగానే కాదు హోస్ట్ గా కూడా అదరగొడతాడు అని అన్ స్టాపబుల్ షో వచ్చిన తరవాతనే తెలిసింది. అల్లు వారి యాప్ ఆహాకే బాలయ్య అన్ స్టాపబుల్ షోతో క్రేజ్ వచ్చింది.
ఈ షో ప్రారంభమైన రెండో రోజు వచ్చిన వ్యూవ్స్ కు ఏకంగా యాప్ క్లాష్ అయ్యింది అంటే ఏ రేంజ్లో గుర్తింపు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఇక అన్ స్టాపబుల్ షోలో గెస్టులుగా ఇప్పటి వరకూ చాలా మంది టాలీవుడ్ సెలబ్రెటీలు వచ్చారు. రీసెంట్ గా ఈ షో మొదటి సీజన్ పూర్తి చేసుకుని రెండో సీజన్ లోకి కూడా అడుగుపెట్టింది. కాగా రెండో సీజన్ లో మొదటి ఎపిసోడ్ కు బాలయ్య హీరోగా నటించిన భగవంత్ కేసరి చిత్రయూనిట్ గెస్టులుగా వచ్చి సందడి చేశారు. అయితే తాజాగా ఈ షో పై ఓ ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Read More: OTT: ఊహించని ట్విస్ట్ తో వచ్చేసిన వారసుడు
రెండో ఎపిసోడ్ లో బాలీవుడ్ హీరో రన్ బీర్ కపూర్ సందడి చేయబోతున్నాడు. రన్ బీర్ కపూర్ టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో యానిమల్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక నటించింది. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్ తో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం అర్జున్ రెడ్డిని మించిపోతుందని అభిమానులు ప్రేక్షకులు అంచనాలు పెంచుకున్నారు. ఈ సినిమా హిందీతో పాటూ తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల కాబోతుంది.
దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ కోసమే రన్ బీర్ కపూర్ అన్ స్టాపబుల్ షోకు వస్తున్నాడు. రన్ బీర్ కపూర్ మాత్రమే కాకుండా రష్మిక, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా సందడి చేయబోతున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసి.. లయన్ ముందుకు యానిమల్ వచ్చింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఒకప్పుడు తెలుగు హీరోలు బాలీవుడ్ సినిమాల్లో నటించి అక్కడ ప్రమోషన్స్ లో పాల్గొనేవారు. కానీ తెలుగు సినిమాకు వచ్చిన క్రేజ్ తో ఇప్పుడు బాలీవుడ్ తారలు వచ్చి తెలుగులో ప్రమోషన్స్ చేస్తున్నారు
Read More: Tamil Rockers Trailer : హెడ్ ఎవరు ?
Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.
దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో వారసుడిగా...
ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటిటి ప్లాట్ఫారంలో...
టాలీవుడ్ లో ఈ వారం థియేటర్లలో కంటే ఓటిటి...
ప్రముఖ హీరోయిన్ అవికా గోర్ గురించి ప్రత్యేకంగా...
అన్ స్టాపబుల్ ఈ షో గురించి ప్రత్యేకంగా...
