Mahesh Babu: గుంటూరు కారం ఎఫెక్ట్..సంక్రాంతి రేసు నుండి త‌ప్పుకున్న ఫ్యామిలీ స్టార్..!

సంక్రాంతి అంటే తెలుగు ప్రేక్ష‌కుల‌కు సినిమాల పండుగ. ఏ పండుగ‌కు సినిమాలు విడుద‌లైనా కాక‌పోయినా సంక్రాంతికి మాత్రం స్టార్ హీరోల సినిమాలు విడుద‌ల‌వుతుంటాయి. అంతే కాదు కొన్ని నెల‌ల ముందుగానే సంక్రాంతి బ‌రిలో నిలిచే సినిమాల అప్డేట్ లు ఇస్తుంటారు. ఇక రాబోయే ఏడాది సంక్రాంతికి విడుద‌ల కాబోయే కొన్ని చిత్రాల‌ను ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ రేసులో విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యామిలీ స్టార్ కూడా ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా ప‌రుశురాం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ గా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో సీతారామం సినిమాతో ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను దోచుకున్న బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా న‌టిస్తోంది.

రీసెంట్ గా దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ సినిమా నుండి పోస్ట‌ర్ కూడా విడుద‌ల చేశారు. అయితే పోస్ట‌ర్ మాత్రం చాలా సింపుల్ గా ఉంది. క్వాలీటీ త‌క్కువ‌గా ఉండ‌ట‌మే కాకుండా అస‌లు అంచ‌నాల‌ను కూడా రీచ్ కాలేక‌పోయింది. దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూస‌ర్ సినిమా నుండి ఇలాంటి పోస్ట‌రా అంటూ నెటిజ‌న్లు సైతం ఆశ్చ‌ర్య‌పోయారు. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి తాజాగా ఓ వార్త ఫిల్మ్ న‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. సంక్రాంతి రేసు నుండి ఈ సినిమా త‌ప్పుకున్నట్టు తెలుస్తోంది. దానికి కొన్ని కార‌ణాలు కూడా ఉన్నాయ‌ట‌. ఈ చిత్రం షూటింగ్ పార్ట్ ఇంకా పూర్త‌వ్వ‌లేదు.

డిసెంబ‌ర్ చివ‌రినాటికి కూడా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యే అవ‌కాశం లేదు. మ‌రోవైపు దిల్ రాజు మ‌హేశ్ బాబు గుంటూరు కారం సినిమా హ‌క్కుల‌ను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా కూడా సంక్రాంతికి విడుద‌ల కాబోతుంది. కాబ‌ట్టి గుంటూరు కారంతో పాటూ ఫ్యామిలీ స్టార్ విడుద‌ల చేస్తే క‌లెక్ష‌న్స్ త‌గ్గి త‌న సినిమాకు తానే పోటీ ఇచ్చుకున్న‌ట్టు అవుతుంది. కాబ‌ట్టి ఫ్యామిలీ స్టార్ విడుద‌లను పోస్ట్ పోన్ చేయ‌డ‌మే మంచిదని స్టార్ ప్రొడ్యూస‌ర్ భావిస్తున్నట్టు స‌మాచారం.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు