Sai Dharam Tej: 10 లక్షలు అడిగిన నెటిజన్..దిమ్మతిరేగే రిప్లై ఇచ్చిన సాయిధరమ్ తేజ్..!

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన ముద్రవేసుకున్నారు. ప్రస్తుతం తేజ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా తేజ్ ఒకేరకమైన సినిమాలు చేయకుండా డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. రీసెంట్ గా విరూపాక్ష లాంటి సినిమాతో తేజ్ ఆకట్టుకున్నారు. కాగా మెగా మేనల్లుడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 9ఏళ్లు అవుతోంది. ఈ నేపథ్యంలో అభిమానులతో సోషల్ మీడియాలో చిట్ చాట్ నిర్వహించాడు. ఇందలో భాగంగా వారు అడిగిన ప్రశ్నలకు ఇంట్రెస్టింగ్ సమాధానాలు ఇచ్చాడు. ఓ నెటిజన్ బ్రో నీ పెళ్లి ఎప్పుడు అంటూ ప్రశ్నించగా నీ పెళ్లి అయిన వెంటనే అంటూ తేజ్ సమాధానం ఇచ్చాడు.

చిన్నమామ పవన్ కల్యాణ్ తో నటించారు. మరి పెద్దమామ చిరంజీవితో ఎప్పుడు నటిస్తారు బ్రో అంటూ ప్రశ్నించాడు. దానికి సాయి ధరమ్ తేజ్…ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తున్నా అంటూ సమాధానం ఇచ్చాడు. మరో నెటిజన్ రామ్ చరణ్ తో కలిసి నటించే అవకాశాలు ఉన్నాయా అని అడగ్గా భవిష్యత్లో కలిసి నటిస్తా అంటూ టక్కన సమాధానం చెప్పాశాడు. ఇక ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ గాంజా శంకర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ సినిమా మాస్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాంతో ఓ నెటిజన్ మరోసారి మాస్ చిత్రంలో నటిస్తున్నారు కదా ఎలా ఫీల్ అవుతున్నారు అంటూ ప్రశ్నించాడు. దానికి తేజ్..మాస్ సినిమాలు మీకు నన్ను మరింత దగ్గర చేస్తాయి. కాబట్టి ఆ సినిమాల్లో నటించడం నాకు కూడా ఇష్టమే అంటూ సమాధానం ఇచ్చాడు. ఇక ఓ నెటిజన్ అయితే ఏకంగా పది లక్షలు పింపించు బ్రో అంటూ గొంతెమ్మ కోరిక కోరాడు. దానికి తేజ్ తన స్టైల్‌లో బ్రహ్మానందం ఫన్నీ స్టిక్కర్‌ను రిప్లై ఇచ్చాడు. దాంతో ప్రస్తుతం తేజ్ ఇచ్చిన రిప్లై నెట్టింట వైరల్ అవుతోంది.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు