Sada: ఆ స్టార్ హీరోని తన కోరిక తీర్చమని అడిగిన సదా..!

వెళ్ళవయ్యా.. వెళ్ళు.. అనే డైలాగ్ చెప్పగానే ఠక్కున గుర్తొచ్చేది హీరోయిన్ సదా. దక్షిణాది చిత్ర పరిశ్రమలో సదాకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో జయం అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సదా.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తరువాత తెలుగు, తమిళ్ లో చాలా సినిమాలే చేసింది. కానీ ఇప్పుడు సరైన ఛాన్సులు రాకపోవడంతో నటనని పక్కన పెట్టేసింది. ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తోంది. పలు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది.

అటు సోషల్ మీడియాలో కూడా హాట్ ఫోటో షూట్లతో కుర్రాల్లను కవ్విస్తుంది సదా. అయితే తాజాగా సదా కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. ఒకప్పుడు హీరోయిన్లు.. దర్శకులు, నిర్మాతలని నోరు తెరిచి ఏదైనా అడగాలన్నా, చెప్పాలన్నా తెగ సిగ్గుపడేవారు. కానీ సదా మాత్రం ఓ స్టార్ హీరోని ఏకంగా తన కోరిక తీర్చమంటూ ఓపెన్ గానే అడిగేసిందట. ఇదేంటని ఆలోచిస్తున్నారా..? ప్రతి హీరోయిన్ కి తన కెరీర్ లో ఓ స్టార్ హీరోతో నటిస్తే జీవితం ధన్యం అవుతుందని భావిస్తారు. అలా హీరోయిన్ సదా కూడా ఓ స్టార్ హీరోతో నటించాలని ఎప్పటినుంచో కోరుకుందట.

ఆ హీరో మరెవరో కాదు విక్రమ్. అలా ఓ రోజు ఓ ఈవెంట్ లో సదా హీరో విక్రమ్ ని మీట్ అవ్వగా.. వెంటనే నాకు మీతో కలిసి నటించాలని ఎప్పటినుంచో కోరిక ఉంది సార్.. మీ సినిమాలో ఒక అవకాశం ఇస్తారా..? అంటూ నిర్మొహమాటంగా అడిగేసిందట. దీంతో విక్రమ్ నవ్వుతూ.. మీలాంటి హీరోయిన్స్ తో నేను నటించకపోతే ఎలా..? అంటూ సరదాగా కామెంట్ చేశారట. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో అపరిచితుడు అనే మూవీ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా ఎంత సెన్సేషనల్ హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో సదా నటన ఎంతగానో ఆకట్టుకుంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు