Ajay Bhupathi: చిన్న క్యాస్టింగ్‌తోనే… అజయ్ భూపతి ప్రయోగం సక్సెస్ అవుతుందా?

ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం వెయిట్ చేస్తున్న సినిమా మంగళవారం. నిజానికి ఇది చిన్న సినిమానే. కానీ, డైరెక్టర్ అజయ్ భూపతి చేస్తున్న ప్రమోషన్స్ వల్ల ఈ చిన్న సినిమాపై ఎక్కడ లేని అంచనాలు పెరుగుతున్నాయి. అలాగే ఇటీవల ఇంటర్వ్యూలో సినిమా గురించి కొన్ని విషయాలను వెల్లడించాడు. సినిమా బడ్జెట్ 20 కోట్ల వరకు అయిందని, అందరూ చిన్న క్యాస్టింగ్ అని చెప్పుకొచ్చాడు.

అయితే పెద్దగా పరిచయం లేని క్యాస్టింగ్ తో మంగళవారం సినిమా 20 కోట్లు కలెక్ట్ చేస్తుందా? సినిమాలో అంత దమ్ము ఉందా అనే ప్రశ్నలు ఇప్పుడు వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో మరో న్యూస్ వినిపిస్తుంది. సినిమాలో ఫస్టాఫ్ లో పాయల్ రాజ్ పుత్ కనిపించదట. కేవలం సినిమాలో ఉండే సపోర్టింగ్ క్యాస్టింగ్ మాత్రమే ఇంటర్వెల్ వరకు ఉంటుందట. దీంతో ఫస్టాఫ్ మొత్తం బోరింగ్ ఉంటుందా? పాయల్ రాజ్ పుత్ లేకుండా మొదటి భాగం ఎలా ఉండబోతుంది అనే ఆలోచనే ఇప్పుడు మంగళవారం సినిమాపై హోప్స్ పెట్టుకున్న వాళ్లకు ఇబ్బందిగా ఉంది.

చిన్న క్యాస్టింగ్, మొదటి భాగంలో పాయల్ లేకండా సినిమా చేయడానికి అజయ్ భూపతికి గడ్స్ ఉండాలని అని అంటున్నారు. అయితే సినిమాలో కంటెంట్ బాగుంటే… చిన్న క్యాస్టింగ్… పెద్ద క్యాస్టింగ్ తో సంబంధం ఉండదని అంటున్నారు సినీ క్రిటిక్స్. అయితే. అజయ్ భూపతి ప్లాన్ ఒక వేళ ఫస్టాప్ లో ఫెయిల్ అయినా.. సెకండాఫ్ లో స్టోరీ స్పీడ్ పెరుగుతుందట. అలాగే సినిమాకి చివరి 40 నుంచి 45 నిమిషాలు చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ లో వరుస ట్విస్ట్ ఉంటాయట. సినిమా హిట్ చేయడానికి ఈ చివరి 40 నిమిషాలు చాలాని మూవీ టీం కూడా అనుకుంటున్నట్టు తెలుస్తుంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు