Kiara Advani: కియారా అద్వానీకి కెరీర్ టర్నింగ్ ఆఫర్… నెగిటివ్ షేడ్స్‌లో..?

సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం సక్సెస్ ఫుల్ హీరోయిన్స్ గురించి చెప్పుకోవాల్సి వస్తే… ముందు కియారా అద్వానీ గురించి మాట్లాడుకోవాలి. ఈ మధ్య కాలంలో కియారా చేసిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే ఫర్మామెన్స్ చేసింది. తెలుగులో కియారా చేసిన సినిమాలో వినయ విధయ రామ సినిమా చేదు ఫలితాన్ని ఇచ్చిన భరత్ అనే నేను మాత్రం మంచి సక్సెస్ అయింది. ఇప్పుడు రామ్ చరణ్ తో మరోసారి జత కట్టి.. శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ చేస్తుంది.

ఇదిలా ఉండగా, కియారా అద్వానీకి మరో బంపర్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2లో కియారా కీలక పాత్రలో నటించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ వార్త చాలా రోజుల నుంచి వినిపిస్తుంది. అయితే తాజాగా బీ టౌన్ నుంచి వచ్చిన అప్ డేట్స్ ను చూస్తే… వార్ 2లో కియారా పాత్ర… ఎన్టీఆర్ కి జోడీగా ఉండబోతుందట. ఒక వేళ ఇదే నిజమైతే ఈ పాత్ర కియారా కెరీర్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు.

ఎందుకంటే… వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్ వపర్ ఫుల్ విలన్ గా నటించబోతున్నాడు. ఈ విషయం ఇటీవల కన్ఫామ్ కూడా అయింది. టైగర్ 3 సినిమా థియేటర్ లో ప్రదర్శిస్తున్న సమయంలో వార్ 2 గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. అందులో హీరో హృతిక్ రోషన్‌కి సినిమాలోని విలన్ ను గురించి చెబుతూ ఒక వాయిస్ వినబడుతుంది. అతను చాలా ప్రమాదకారి అని, అతను చికట్లో ఉంటాడని, అతనితో పోరాటం.. మరణంతో సమానం అంటూ విలన్ పాత్రకు ఎలివేషన్స్ ఇచ్చారు. ఇక్కడ విలన్ పాత్ర చేస్తున్నది ఎన్టీఆర్ అని అధికారికంగా చెప్పకపోయినా, దాదాపు తారక్ అనే చెప్పేశారు.

- Advertisement -

అంటే.. వార్ 2లో విలన్ అయిన తారక్ కు జోడీగా అంటే.. కియారా కూడా నెగిటివ్ షేడ్స్ లో కనిపిస్తుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఒక వేళ ఇదే నిజమైతే… కియారా కెరీర్ టర్న్ అయినట్టే.

కాగా, ఎన్టీఆర్ కు జోడీగా ముందు… అలియా భట్ ను అనుకున్నారు. కానీ, ఆమెకు డేట్స్ కుదరకపోవడంతో కియారా ని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు