Kalyaan Dhev: బిడ్డకోసం తల్లడిల్లుతున్న కల్యాణ్ దేవ్..శ్రీజపై నెటిజన్స్ ఫైర్..?

మెగా డాటర్ శ్రీజ తన భర్త కల్యాణ్ దేవ్ కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. చాలాా నెలలుగా శ్రీజ కల్యాణ్ దేవ్ విడివిడానే ఉంటున్నారు. కారణం తెలియదు కానీ శ్రీజ తన సోషల్ మీడియాలో భర్త ఫోటోలను డిలీట్ చేసేసింది. అంతే కాకుండా కల్యాణ్ దేవ్ కూడా తన సోషల్ మీడియాలో శ్రీజ ఫోటోలను డిలీట్ చేశాడు. ఇక పెళ్ళి తరవాత మెగా ఫ్యామిలీ కల్యాణ్ దేవ్ ను హీరోగా పరిచయం చేస్తూ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనగా ఇప్పుడు అసలు పట్టించుకోవడం లేదు. కల్యాణ్ దేవ్ కు ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ ఆఫర్లు కూడా రావడం లేదు. మరోవైపు అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ కల్యాణ్ దేవ్ శ్రీజ విడాకులు తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. నిహారిక తన భర్తతో విడాకులు తీసుకున్నప్పటికీ ఆ విషయం సీక్రెట్ గా ఉంచిన సంగతి తెలిసిందే.

కాగా శ్రీజ కల్యాణ్ దేవ్ కూడా డివోర్స్ తీసుకున్నారని కానీ ఆ విషయం గోప్యంగా ఉంచారని ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే శ్రీజ కల్యాణ్ దేవ్ లకు పెళ్లి తరవాత ఓ కూతురు జన్మించిన సంగతి తెలిసిందే. కాగా భార్య భర్తలు విడాకులు తీసుకుంటే వారి పిల్లలు తల్లి సంరక్షణలోనే ఉండాలని కోర్టులు తీర్పు ఇస్తుంటాయి. చిన్న వయసులో తండ్రి వారి ఆలానా పాలనా చూసుకోలేడు కాబట్టి ఇలాంటి తీర్పు ఇస్తుంటాయి. కానీ అప్పుడప్పుడు తండ్రి వెళ్లి పిల్లలను కలిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు శ్రీజ కల్యాణ్ దేవ్ విషయంలోనూ అదే జరుగుతుందేమో అనిపిస్తుంది.

వీరి కూతురు ప్రస్తుతం శ్రీజ వద్దనే ఉంటుంది. కానీ అప్పుడప్పుడు కల్యాణ్ దేవ్ వద్దకు వెళుతుంది. పుట్టిన రోజులకు స్పెషల్ డేలకు ఎక్కువగా కల్యాణ్ దేవ్ తన కూతురుతో కలిసి ఫోటోలను షేర్ చేస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే చిల్డ్రన్స్ డే రోజున కూతురుతో ఆడుకున్న వీడియోను షేర్ చేసిన కల్యాణ్ దేవ్..జీవితాంతం ఇలా నాతోనే ఉండాలని కోరుకుంటున్నా అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఆ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు శ్రీజను తిట్టిపోస్తున్నారు. ఎంత చక్కగా చూసుకుంటున్నాడు. శ్రీజ ఇంత మంచివాడిని వదిలేసిందా అని ఫైర్ అవుతున్నారు. అయితే నిజానికి ఇద్దరి మధ్య జరిగింది ఏంటో ఎవరికీ తెలియదు. కాబట్టి శ్రీజను మాత్రమే నింధించడం సరికాదేమో.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు