Varun Tej: వరుణ్ తేజ్ పెళ్లి ఎఫెక్ట్.. సాయి ధరమ్ తేజ్ పెళ్లికి ఒత్తిడి..!

టాలీవుడ్ లవ్ బర్డ్స్ వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ఇటీవల పెళ్లి బంధంతో ఒకటైన విషయం అందరికీ తెలిసిందే. వీరి వివాహం ముగిసి సుమారు రెండు వారాలు అవుతుంది. ఈ పెళ్లికి మెగా ఫ్యామిలీ అంతా వెళ్లి సందడి చేశారు. ఇప్పటికీ వరుణ్ – లావణ్య పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉన్నాయి. ఈ వివాహ వేడుకలోని బెస్ట్ మూమెంట్స్ కి సంబంధించిన ఫోటోలను మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కటిగా షేర్ చేస్తూ గుర్తు చేసుకుంటున్నారు.

అయితే తాజాగా లావణ్య – వరుణ్ తేజ్ వివాహం జరగడంతో మెగా ఫ్యామిలీలో ఇంకా సింగిల్ గా ఉన్న తదుపరి హీరో సాయిధరమ్ తేజ్ పై పెళ్లి ఒత్తిడి పెరిగిందని తెలుస్తోంది. వరుణ్ పెళ్లి చేసుకోవడంతో తన కుటుంబ సభ్యులు కూడా తనని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారని తాజాగా సాయిధరమ్ తేజ్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఈ పోస్టులో సాయిధరమ్ తేజ్ ఏం రాసుకొచ్చాడంటే.. వై, క్యో, ఎన్ ? ఎంత పని చేశావ్ రా వరుణ్ బాబు.. నీకు పెళ్లి సంబరాలు.. నాకు స్వతంత్ర పోరాటం అంటూ తేజ్ ఫన్నీ పోస్ట్ చేశాడు.

స్వతంత్ర పోరాటం అంటే నేను సింగిల్ గా ఉండేందుకు పోరాడుతున్న అని పరోక్షంగా తేజ్ ఈ పోస్ట్ ద్వారా తెలియజేశాడు. ఇలా తేజ్ చేసిన ఈ పోస్ట్ తో అతని ఇంట్లో కూడా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని అర్థమవుతుంది. దీంతో తేజ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో మరికొద్ది రోజులలోనే మెగా కాంపౌండ్ లో సాయిధరమ్ తేజ్ పెళ్లి బాజాలు మొగబోతున్నాయి అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు