Sai Pallavi: లేడీ పవర్ స్టార్ కొత్త కండిషన్స్… మేకర్స్ కి ఇక చుక్కలే !

లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి తన కొత్త సినిమాలకు కొత్త కండిషన్స్ పెడుతూ మేకర్స్ కి చుక్కలు చూపిస్తుందా? అసలు ఆమె పెడుతున్న కండిషన్స్ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది హీరోయిన్లు ఉన్నప్పటికీ అందులో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ చాలా ప్రత్యేకం. స్టార్ హీరోయిన్ గా ఎదగాలని అనుకునే హీరోయిన్లు చిట్టి బట్టలు ధరించి, గ్లామర్ ను ఒలకబోస్తూ, తమ అందాల విందుతో యూత్ ను బాగా ఆకట్టుకుంటారు.

దీంతో వీళ్ళు చేసే స్కిన్ షోకు, ఆటోమేటిక్ గా ఫాలోవర్స్ బాగా పెరిగిపోతారు. కానీ సాయి పల్లవి మాత్రం చాలా ప్రత్యేకం. ఆమె ఇప్పటివరకు పలు సినిమాల్లో నటించినప్పటికీ స్కిన్ షోకు మాత్రం దూరంగానే ఉంది. పైగా సిల్వర్ స్క్రీన్ పై సైతం పద్ధతిగా కనిపించడానికి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటుంది. దీనివల్ల ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినా ఫాన్స్ ఫాలోయింగ్ మాత్రం స్టార్ హీరోయిన్లకు మించి అందుకుంది ఈ బ్యూటీ. అందుకే ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఏ స్టార్ హీరోయిన్ కు దక్కని లేడీ పవర్ స్టార్ అనే బిరుదు సాయి పల్లవికి దక్కింది.

ఇదిలా ఉంటే సాయి పల్లవి కొత్త సినిమాలకు కొత్త కొత్త కండిషన్స్ పెడుతోందట. అది కూడా సినిమా హిట్ కావడానికి అని అంటున్నారు. మరి ఆమె కండిషన్స్ ఏంటి అంటే… కొన్ని రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సాయి పల్లవి ఇప్పుడిప్పుడే మళ్ళీ సెలెక్టివ్ గా కథలను ఎంచుకుంటూ యాక్టివ్ గా సినిమాలు చేస్తోంది. అయితే తాను ఒప్పుకునే కొత్త సినిమాలకు మాత్రం కండిషన్స్ అప్లై అంటోంది. సినిమాకు కమిట్ అవ్వాలంటే ముందుగానే వర్క్ షాప్ చేయాలని అంటుందట సాయి పల్లవి.

- Advertisement -

ఇలా వర్క్ షాప్ నిర్వహించడం వల్ల ఎలాంటి సీన్స్ ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? ఇంకా ఆ సినిమాకు తగ్గ గెటప్ ఎలా ఉండాలి? అనే విషయాలపై క్లారిటీ వస్తుందని, అప్పుడే మూవీ పర్ఫెక్ట్ గా ఉంటుందని సాయి పల్లవి భావిస్తోందట. ఇలా సినిమా హిట్ కావడానికి తన సైట్ నుంచి మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటూ బాగానే సహకరిస్తుంది సాయి పల్లవి. ప్రస్తుతం తాను హీరోయిన్ గా నటిస్తున్న ‘ తండేల్’ మూవీకి కూడా వర్క్ షాప్స్ నిర్వహించింది సాయి పల్లవి. సినిమా హిట్ అవ్వాలంటే ఇలాంటి కండిషన్లు ఉండడం మంచిదేలే.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు