Viswambhara : హీరోయిన్ గా చెన్నై చిన్నది ఫిక్స్ … మెగాస్టార్ కోరిక తీరినట్టే!

మెగాస్టార్ చిరంజీవి ఫాంటసీ మూవీలో హీరోయిన్ ఫిక్స్ అయింది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ఓ సీనియర్ హీరోయిన్ ఈ మూవీలో మెగాస్టార్ తో రొమాన్స్ చేయబోతోంది. మరి ఆ చెన్నై చిన్నది ఎవరు? అంటే…

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 156వ సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నారు. మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సోషియో ఫాంటసీ మూవీని యువి క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ‘ విశ్వంభర’ అనే ఆసక్తికర టైటిల్ తో రూపొందనున్న ఈ మూవీ మూడు లోకాల చుట్టూ తిరుగుతుందని ప్రచారం జరుగుతుంది. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో చాలామంది హీరోయిన్లు కనిపించబోతున్నారు. అయితే మెయిన్ లీడ్ గా మాత్రం ఓ సీనియర్ హీరోయిన్ నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం చెన్నై చిన్నది త్రిష “విశ్వంభర ” మూవీలో హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.

అయితే ముందుగా ఈ సినిమాలో అనుష్కను తీసుకోవాలని అనుకున్నారు మేకర్స్. కానీ అనుష్క ఆ పాత్రను రిజెక్ట్ చేసిందని కొంతమంది అంటుంటే, అనుష్క లావు అవ్వడం వల్లే ఈ సినిమా ఆఫర్ చేజారిందని మరోవైపు ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ త్రిషను తీసుకోవాలని మెగాస్టార్ సజెస్ట్ చేసినట్టుగా రూమర్ కొన్ని రోజుల క్రితమే బయటకు వచ్చింది. ప్రస్తుతం త్రిష కు సౌత్ ఇండస్ట్రీలో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పైగా ఇటీవల జరిగిన మన్సూర్ తో ఫైట్ కారణంగా ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరింతగా పెరిగింది. ఇప్పుడు త్రిష కు ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలి అనుకుంటున్నారు విశ్వంభర మేకర్స్. ఏదైతేనేం మొత్తానికి త్రిషతో కలిసి మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోవాలి అనుకున్న మెగాస్టార్ కోరిక తీరిపోయింది. గతంలో కూడా వీరిద్దరూ స్టాలిన్ సినిమాలో కలిసి కనిపించిన విషయం తెలిసిందే. అప్పట్లో సిల్వర్ స్క్రీన్ పై త్రిష, చిరు తండ్రి కూతుర్లలా కనిపించారని తీవ్ర విమర్శలు వచ్చాయి. దాదాపు 17 ఏళ్ల తర్వాత మరోసారి ఈ జంట ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయబోతోంది. మరి ఇప్పుడు వెండితెరపై ఈ పెయిర్ ఎలా కనిపిస్తుందో చూడాలి.

- Advertisement -

దాదాపు 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సోషియో ఫాంటసీ మూవీలో మరి కొంతమంది హీరోయిన్లు కూడా నటిస్తున్నారు. ముల్లోకాల చుట్టూ తిరిగే కథ కావడంతో సినిమాలో ఎక్కువ మంది హీరోయిన్లు కనిపించే స్కోప్ ఉంటుంది. ఇక మెయిన్ ఫిమేల్ లీడ్ గా త్రిష ఫిక్స్ కాగా ఇతర పాత్రల కోసం సీనియర్ హీరోయిన్లు తమన్నా, పూజా హెగ్డే, రాశి కన్నా రీతు వర్మ వంటి వారిని మేకర్స్ సంప్రదిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. మరి వీరిలో ఎవరికి ఈ హైట్ బడ్జెట్ మూవీలో నటించే అవకాశం దక్కుతుందో చూడాలి.

 

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు