Bollywood: అత్యంత సంపన్న నటిగా స్టార్ హీరోయిన్.. ఎన్ని కోట్లంటే..?

బాలీవుడ్ లో ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ ఇప్పటికే తమ హవా చూపిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా అలనాటి హీరోయిన్స్ ఐశ్వర్య రాయ్ కూడా మిస్ వరల్డ్ టైటిల్ ని గెలుచుకొని మరింత పాపులారిటీ అందుకుంది.. మొదట డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఇరువర్ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తెలుగు, తమిళ, హిందీ భాషలలో మంచి పాపులారిటీ అందుకుంది. ప్రస్తుతం అడపాదడపా సినిమాలలో నటిస్తున్న ఈమె ఒక్కో చిత్రానికి 10 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ రూ.7 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుందట. ఇక ఈమెతోపాటు బాలీవుడ్లో అత్యంత సంపన్న నటీమణులుగా గుర్తింపు తెచ్చుకున్న వారి గురించి ఇప్పుడు చూద్దాం.

1). ఐశ్వర్యరాయ్:
ఇండియాలోని అత్యంత సంపన్నమైన నటిగా ఐశ్వర్యారాయ్ పేరు పొందింది. దాదాపుగా ఈమె సంపాదన 800 కోట్ల రూపాయలు అన్నట్లుగా తెలుస్తున్నది.

2). ప్రియాంక చోప్రా:
మాజీ ప్రపంచ సుందరిగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈమె బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. ఈమె ఇండియాలో అత్యంత సంపన్నమైన నటిగా రెండవ స్థానాన్ని అందుకుంది. దాదాపుగా ఈమె ఆస్తి విలువ రూ.600 కోట్లు.. ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలలో నటిస్తూ అమెరికాలో తన భర్త ని నిక్ జోనస్ తో స్థిరపడిపోయింది. పలు రకాల కాస్మెటిక్స్ ఇతరత్రా బిజినెస్ లను కలిగి ఉన్నది.

- Advertisement -

3). ఆలియా భట్:
ఇండియాలో అత్యంత సంపన్నమైన మూడవ నటిగా పేరు సంపాదించింది ఆలియా భట్.. ఈమె ఎవరో కాదు ప్రముఖ నిర్మాత అయిన మహేష్ భట్ కూతురు. ఈమె ఆస్తి విలువ సుమారుగా 550 కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. ఒక్క చిత్రానికి 9కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటోంది. పలు రకాల దుస్తుల బ్రాండ్లను సైతం కలిగి ఉంటూ వ్యాపారంలో భారీగానే సంపాదిస్తుంది.

4). దీపికా పదుకొనే:
ఇండియాలో అత్యంత సంపన్నమైన హీరోయిన్ లలో నాలుగవ స్థానంలో ఉన్నది. దాదాపుగా ఈమె ఆస్తి 500 కోట్ల రూపాయలకు పైగా ఉన్నది. ఒక్క చిత్రానికి రూ .18 నుంచి రూ .20 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకు ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.. ఇటీవలే ఒక బ్యూటీ కంపెనీని కూడా స్థాపించింది.

5). కరీనాకపూర్:
ఇండియాలో అత్యంత సంపన్నమైన నటుల జాబితాలలో ఐదవ స్థానంలో ఉన్నది. ఈమె ఆస్తి రూ.480 కోట్లు.. ఒక్కో చిత్రానికి రూ.8 నుంచి రూ .10 కోట్ల రూపాయల వరకు తీసుకుంటుంది సమాచారం.

6). కత్రినా కైఫ్ :
చివరిగా ఆరో స్థానంలో కత్రినా కైఫ్ ఉన్నది. ఈమె ఆస్తి రూ.430 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. ఈ ముద్దుగుమ్మ కూడా పలు రకాల బ్యూటీ ఉత్పత్తులను ప్రారంభించింది. దీనివల్ల 100 కోట్ల రూపాయలకు పైగా సంపాదిస్తోంది ఏడాదికి. సినిమాల రెమ్యూనరేషన్ విషయానికి వస్తే ఎనిమిది కోట్ల రూపాయలు అందుకుంటున్నట్లు సమాచారం.

 

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు