Shobha shetty: బిగ్ బాస్ బ్యూటీని అసభ్యంగా తాకిన వ్యక్తి…వీడియో వైరల్..!

బిగ్ బాస్ సీజన్ 7లోకి ఎంట్రీ ఇచ్చిన సీరియల్ బ్యూటీలలో శోభాశెట్టి కూడా ఒకరు. బిగ్ బాస్ లోకి రాకముందు శోభాశెట్టి కార్తీకదీపం సీరియల్ లో మోనితగా మెప్పించింది. సీరియల్ లో మోనిత విలన్ రోల్ కాగా ఆ పాత్రకు తాను తప్ప మరెవరూ న్యాయం చేయలేరని శోభా నిరూపించుకుంది. అంతే కాకుండా సీరియల్ లో దీపకు ఎంత క్రేజ్ వచ్చిందో..డాక్టర్ బాబుకు ఎంత క్రేజ్ వచ్చిందో మోనితకు కూడా అంతే క్రేజ్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే మోనిత రియల్ లైఫ్ శోభాశెట్టికి బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. ఇక బిగ్ బాస్ లోకి వచ్చిన తరవాత కూడా శోభాశెట్టి అదే రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకుంది. అంతే కాకుండా రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా శోభా మోనిత అనే ముద్ర పడింది. ఇక శోభాశెట్టి హౌస్ లో అడుగుపెట్టిన తరవాత త్వరలోనే ఎలిమినేట్ అవుతుందని అంచనా వేశారు. ఆమెను వీలైనంత త్వరగా ఇంటి నుండి పంపించాలని ప్రేక్షకులు నిర్నయించుకున్నారు. కానీ తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్టు జరిగింది.

శోభాశెట్టిని బిగ్ బాస్ నుండి ఎవరూ బయటకు పంపించలేకపోయారు. అంతే కాకుండా ఎవరూ ఊహించని విధంగా శోభాశెట్టి ఏకంగా పద్నాలుగు వారాల పాటూ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగింది. అయితే ఎట్టకేలకు బ్యూటీ పద్నాలుగు వారాలకు హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోయింది. అయితే బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన వారికి క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతే కాకుండా పద్నాలుగు వారాలపాటూ హౌస్ లో ఉన్నారంటే దాదాపు విన్నర్ అవ్వాల్సిన వారే అనుకోవాలి.

ఇక అసలు విషయానికి వస్తే శోభాశెట్టి హౌస్ నుండి బయటకు వచ్చిన తరవాత ఓ ఈవెంట్ నిర్వహించారు. ఆ ఈవెంట్ లో ఆమె పక్కన ఉన్న ఓ వ్యక్తి శోభా నడుము పై చేయి వేసి ఒక్కసారిగా పక్కకు లాగాడు. అలా జరిగిన వెంటనే శోభాశెట్టి కాస్త ఇబ్బంది పడినట్టుగా కనిపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో నెటిజన్లు సదరు వ్యక్తిపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. మీ ఇంట్లో వాళ్లను ఇలానే చేస్తే ఊరుకుంటావా అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా మరో నెటిజన్ ఇంట్లో వాళ్లు సంస్కారం నేర్పించలేదా అంటూ కామెంట్ చేశాడు.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు