Salaar : ఫ్యాన్స్ ను భయపెడుతున్న “సలార్” సైలెన్స్

మోస్ట్ అవైటింగ్ మూవీ “సలార్” త్వరలో రిలీజ్ కాబోతోంది. అయితే సినిమా రిలీజ్ కు మరికొన్ని రోజులు మాత్రమే ఉండగా మేకర్స్ ఫ్యాన్స్ ను భయపెడుతున్నారు. మరి వారి భయానికి కారణం ఏంటి? అసలు మేకర్స్ ఏం ప్లాన్ చేస్తున్నారు? అనే విషయంలోకి వెళ్తే…

డార్లింగ్ ప్రభాస్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “సలార్”. కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా, శృతిహాసన్ ఈ పాన్ ఇండియా మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న “సలార్” మూవీ రిలీజ్ కాబోతోంది. సినిమా రిలీజ్ కు ఇంకా పట్టుమని పది రోజులు కూడా లేదు. కానీ మేకర్స్ మాత్రం ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో దున్నపోతు పై వర్షం పడ్డట్టు ఎలాంటి రెస్పాన్స్ లేకుండా ఉండడం డార్లింగ్ ఫ్యాన్స్ కు చిర్రెత్తేలా చేస్తోంది. సలార్ మూవీ థియేటర్లలో సందడి చేయడానికి ఎక్కువ సమయం లేకపోవడంతో ఈ వారం రోజులను ఉపయోగించుకొని ప్రమోషన్స్ లో టీం దూసుకెళ్తోంది అని అంతా భావించారు.

కానీ ప్రస్తుతం సలార్ టీం వ్యవహరిస్తున్న తీరు అందరిని దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. కొన్ని రోజుల క్రితం ట్రైలర్ ను రిలీజ్ చేసి కాస్త హడావిడి చేసిన మేకర్స్ అప్పటినుంచి ఇప్పటిదాకా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. మరోవైపు సలార్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉండట్లేదనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ఇక ఈ రానున్న పది రోజుల్లో సినిమా నుంచి ఏమైనా పాటలు విడుదలవుతాయా అంటే అది కూడా సందేహమే. నిజానికి సలార్ పాన్ ఇండియా మూవీ. కాబట్టి దేశవ్యాప్తంగా చిత్ర బృందం అంతా కలిసి పర్యటించడంతో పాటు, ప్రధాన నగరాల్లో ఇంటర్వ్యూలు వంటివి ప్లాన్ చేయాల్సి ఉంటుంది. కానీ సలార్ విషయంలో ఇవేవీ జరగట్లేదు. ఒకవేళ మూవీ ప్రమోషనల్ ఈవెంట్లు ప్లాన్ చేసినా కూడా హీరో హీరోయిన్లు ప్రభాస్, శృతిహాసన్ పాల్గొంటారా? అంటే అది సమాధానం లేని ప్రశ్న.

- Advertisement -

సినిమా విడుదలకు ఇంకా పది రోజుల సమయం మాత్రమే ఉండడంతో మేకర్స్ పాటిస్తున్న ఈ మౌనం ప్రభాస్ అభిమానులను భయాందోళనలకు గురిచేస్తుంది. ఇప్పటికే వరుస ప్లాట్లు చవిచూస్తున్న ప్రభాస్కు ఈ మూవీతో అయినా హిట్ పడాలని ఆశిస్తున్నా ఆయన అభిమానులకు “సలార్” సైలెన్స్ పీడకలలా మారింది.

 

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News& Gossip from all Film Industires.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు