Jagapathi Babu: నటుడు కాకపోయుంటే.. అలా చేసి అందర్నీ వణికించేవాడిని – జగపతిబాబు

ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ప్రముఖ హీరో జగపతిబాబు మొదట విలన్ గానే తన కెరీర్ ని మొదలుపెట్టినా.. ఆ తర్వాత ఫ్యామిలీ హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు.. అయితే ఈ మధ్యకాలంలో మళ్లీ విలన్ గా అవతారం ఎత్తిన ఈయన.. టాలీవుడ్ ని ఏలేస్తున్నారని చెప్పవచ్చు.. ఇక తాజాగా జగపతిబాబు చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది.. ముఖ్యంగా తాను సినిమాలలోకి రాకపోయి ఉంటే ఆ ఉద్యోగం చేసే వాడిని అని.. ఆ ఉద్యోగంతో అందరిని గడగడలాడించే వాడిని అంటూ ఆ ట్వీట్ లో చెప్పుకొచ్చారు. మరి ఉన్నట్టుండి జగపతిబాబు ఈ ట్వీట్ చేయడం వెనుక అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

సూపర్ కాప్..
ఒకవైపు సినిమాలలో ఫుల్ బిజీగా ఉంటూనే.. మరొకవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ఈయన తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటారు.. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ట్రెండీ లుక్స్ తో కూడా అభిమానులను ఆకట్టుకునే ఈయన తాజాగా ఒక పోస్ట్ చేశారు. ట్విట్టర్ వేదికగా తన ఫోటోతో పాటు ఒక విషయాన్ని కూడా పంచుకున్నారు.. సినిమాల్లోకి రాకపోయి ఉంటే కచ్చితంగా సూపర్ కాప్ అయ్యేవాడిని అని వివరించారు.. ఇప్పుడున్న సూపర్ కాప్ ల లాగా లా అండ్ ఆర్డర్ ని గడగడలాడించే వాడిని.. ఏమంటారు అని అడిగారు..అలాగే తాను ఓ పోలీస్ ఆఫీసర్ డ్రెస్ లో తెగ స్టైలిష్ గా కనిపించారు.. కూలింగ్ గ్లాస్ పెట్టుకొని.. క్రేజీగా కూల్ గా ఆకట్టుకున్నారు జగపతిబాబు..

రుస్లాన్ సినిమా విశేషాలు..
ఇకపోతే తాజాగా ఈయన షేర్ చేసిన ఫోటో రుస్లాన్ అనే సినిమాలోని తన పాత్రలాగా కనిపిస్తోంది.. ఏప్రిల్ 26వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు సమాచారం.. ఈ సినిమాలో జగపతిబాబు పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తుండగా ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో విద్య మల్వాడే , భక్తి క్లీన్ , ఆయుష్ శర్మ లాంటివాళ్ళు కీలకపాత్రలు పోషిస్తున్నారు.. కరణ్ భుటాని ఈ సినిమా నిర్మిస్తూ ఉండడం గమనార్హం.

- Advertisement -

జగపతిబాబు కెరియర్..
ఒకప్పుడు సూపర్ డూపర్ హిట్ చిత్రాలలో నటిస్తూ దాదాపు 100కు పైగా చిత్రాలలో నటించిన ఈయన.. తన అద్భుతమైన నటనతో ఏకంగా ఏడు నంది అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం విలన్ గా ఇరగదీస్తూ సూపర్ ఆర్టిస్టుగా దూసుకెళ్తున్న ఈయనకి ఇప్పటికీ పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారనటంలో సందేహం లేదు. లెజెండ్ సినిమాతో విలన్ గా మారిన ఈయన ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తలో గాయం, అంతఃపురం, ప్రవరాఖ్యుడు వంటి చిత్రాలలో విలన్ గా నటించి ఆ తర్వాత హీరోగా చేసి మళ్లీ విలన్ గా అవతారం ఎత్తి రంగస్థలం, శ్రీమంతుడు వంటి సినిమాలలో అద్భుతమైన నటన కనబరిచి ప్రేక్షకుల మన్ననలు పొందారు. ఇక ఇప్పటికీ వరుస చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు జగపతిబాబు..

Check out Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు