Jagapathi Babu : ఆ స్టార్ తో లాంచ్ అయ్యాడు. కానీ తనతో చేయడానికి 30 యేళ్లు పట్టిఇంది…

Chiranjeevi

టాలీవుడ్ లో ఫ్యామిలీ స్టార్ గా, మ్యాన్లీ స్టార్ గా ప్రేక్షకుల చేత అభిమానాన్ని చురగొని, ఇప్పుడు ప్రతినాయకుడిగానూ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సూపర్ ఫామ్ తో దూసుకుపోతున్న విలక్షణ నటుడు “జగపతి బాబు”. ప్రముఖ దర్శక నిర్మాత వి. బి. రాజేంద్ర ప్రసాద్ తనయుడైన జగపతి బాబుకు ముందు సినిమాలంటే పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. పైగా తన తల్లి కూడా సినిమాల్లోకి రావద్దని చెప్పేదట. అయితే జగపతి బాబు కూడా ముందు పెద్దగా ఇంపార్టెన్స్ చూపించలేదు. కానీ తన కాలేజి రోజుల నుండి సినిమాలపై సడన్ గా ఇంట్రస్ట్ పుట్టి సినిమాల్లోకి రావాలని ట్రై చేసారు. అయితే తన తండ్రి సహకారం లేకుండానే ప్రయత్నించగా, దాన్ని ముందే తెలుసుకున్న రాజేంద్ర ప్రసాద్ తానే నిర్మాతగా జగపతి బాబును పరిచయం చేయించాడు.

అయితే జగపతిబాబు సినిమా ఎంట్రీయే అప్పట్లో గ్రాండ్ గా చెప్పుకునేవారు. అప్పటి స్టార్ దర్శకుడు మధుసూదనరావు దర్శకత్వం లో జగపతిబాబు ద్విపాత్రాభినయంతో రెబల్ స్టార్ కృష్ణం రాజు ప్రత్యేక పాత్రలో నటించడం జరిగింది. “సింహస్వప్నం” పేరుతో తెరకెక్కిన ఈ సినిమా ఓపెనింగ్ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా గ్రాండ్ గా జరిగింది.1989 లో విడుదలైన అయితే ఈ సినిమా అప్పట్లో యావరేజ్ గా ఆడింది. జగపతిబాబుకి సరైన బ్రేక్ రావడానికి గాయం, శుభలగ్నం సినిమాల దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది.

- Advertisement -

ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి చేత గ్రాండ్ గా లాంచ్ అయిన జగపతి బాబు ఆ తర్వాత మంచి స్టార్ అయినా ఎప్పుడూ చిరుతో నటించే అయితే అవకాశం రాలేదు. అయితే సరిగ్గా మూడు దశాబ్దాల తర్వాత చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం “సైరా” లో ప్రత్యేక పాత్రలో నటించే అవకాశం వచ్చింది. 2019 లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. మెగా ఫ్యామిలీ కి క్లోజ్ గా ఉండే జగపతిబాబు రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి తేజ్ లతో కూడా నటించడం విశేషం. ఇక జగపతిబాబు ప్రస్తుతం ఇండియా లో వన్ వన్ అఫ్ ది బిజీయెస్ట్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తున్నాడు.

Check out Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు