Rajamouli : ఫారిన్ హీరోయిన్లపైనే రాజమౌళి కన్ను… ఇదే కారణమా?

Rajamouli

రాజమౌళి దర్శకత్వంలో సినిమా అంటే అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి మొదలుకొని రిలీజ్ అయ్యేదాకా వేరే లెవెల్లో బజ్ ఉంటుంది. మార్కెటింగ్ పై మంచి గ్రిప్ ఉన్న జక్కన్న చేతిలో పడ్డారు అంటే ఆ స్టార్స్ దశ తిరిగినట్టే. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్లుగా కొనసాగుతున్న టాలీవుడ్ హీరోలు ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ల క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా పెరగడానికి మూల కారణం జక్కన్న అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం మన స్టార్స్ కి మాత్రమే కాదు ఇంగ్లీష్ హీరోయిన్లకు కూడా రాజమౌళి లైఫ్ ఇస్తుండడం విశేషం. మరి రాజమౌళి కన్ను ఫారిన్ హీరోయిన్లపైనే ఎందుకు పడుతుంది? అంటే…

సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో ఓ అంతర్జాతీయ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. “SSMB 29” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమాలో మహేష్ బాబు హీరో అన్న విషయాన్ని ఇప్పటికే అఫీషియల్ గా ప్రకటించారు. కానీ ఇతర నటీనటులు ఎవరు అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. మరోవైపు మహేష్ ఈ సినిమా కోసం జర్మనీ అడవుల్లో తిరిగేసి వచ్చి, తన మేక్ ఓవర్ కోసం వర్కౌట్స్ మొదలు పెట్టాడు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఒక ఫారిన్ బ్యూటీ కనిపించబోతోంది అనే వార్త వైరల్ అవుతుంది. చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ అనే ఇండోనేషియన్ బ్యూటీ మహేష్ బాబుతో రొమాన్స్ చేయనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అమెరికాలో పుట్టిన ఈ బ్యూటీ ఇండోనేషియన్ భాషలో పలు సినిమాల్లో నటించింది. అయితే ఇప్పుడు ఆమె రాజమౌళి ప్రాజెక్టులో కనిపించబోతోంది అనడానికి సాక్ష్యాన్ని కూడా చూపిస్తున్నారు. ఇంస్టాగ్రామ్ లో చెల్సియా… రాజమౌళిని ఫాలో అవుతుండడమే SSMB 29 లో ఆమె హీరోయిన్ అంటూ రూమర్లు రావడానికి కారణమైంది. ఈ సంగతి అలా ఉంచితే, రాజమౌళి సినిమాల్లో హాలీవుడ్ హీరోయిన్లు నటించడం కొత్తేమీ కాదు.

- Advertisement -

గతంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన త్రిబుల్ ఆర్ సినిమాలో పలువురు ఫారిన్ యాక్టర్లు కీలక పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ సరసన ఏకంగా హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ ను నటింపజేశారు జక్కన్న. అయితే ఒలివియాకు ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాతనే ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కింది అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇండోనేషియన్ భామ ఫేట్ ను మార్చడానికి జక్కన్న నడుం బిగించాడని కామెంట్స్ చేస్తున్నారు ఆయన అభిమానులు.

కాగా SSMB 29 మూవీ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో కూడా ఫారిన్ నటీనటులు ఉండే అవకాశం ఉందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమాను ఇంటర్నేషనల్ లెవెల్లో తెరకెక్కించే ఆలోచనలో ఉండడం వల్ల ఫారిన్ బ్యూటీని హీరోయిన్ గా తీసుకుంటున్నాడని అంటున్నారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు