Krish – Anushka: తెర పై పునః కలయిక.. చివరి అవకాశమా?లేక.?

Krish – Anushka

ప్రముఖ డైరెక్టర్ క్రిష్, సీనియర్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కాంబినేషన్ అనగానే తెరపై కనిపించే సినిమా వేదం.. ఈ సినిమాలో అనుష్క వ్యాంప్ పాత్ర పోషించి అందరిని ఆశ్చర్యపరచడమే కాదు తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకుంది. ఇలాంటి కాంబో మళ్లీ రిపీట్ అయితే చూడాలని అభిమానులే కాదు సినీ పరిశ్రమ కూడా ఎదురు చూస్తూ ఉందనడంలో సందేహం లేదు. ఇకపోతే వీరిద్దరూ ఎదుగుతూ ఎదుగుతూ కెరియర్ బాగా ఉన్న దశలోనే బోల్తా పడ్డారు. ఇద్దరూ ప్రతిభా వంతులే కానీ డెస్టినీ మాత్రం వీళ్ళ పక్షాన లేదు.. ఆ ఇద్దరు కలిసి ఒక సినిమా చేయబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరమైన వార్త.. 42 ఏళ్ల వయసున్న అనుష్క మంగళూరు, తుళు మహిళ.. బెంగళూరులోనే చదివి యోగ ఇన్స్ట్రక్టర్ గా మారి కన్నడ సినిమాల కంటే తెలుగు, తమిళ్ సినిమాలు లోనే ప్రసిద్ధి చెందింది.

కన్నడలో ఒక సినిమా కూడా చేయలేదు.. 2005 నుంచి సినీ ఫీల్డ్ లో ఉన్న ఈమె ప్రస్తుతం మలయాళం లో కథనార్ అనే ఒక సినిమా చేస్తోంది. సింగం వరకు ఇతర హీరోయిన్ల లాగే గెంతులు వేసి ఆరబోతలతో కెరియర్ సాగించిన ఈమె అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి, భాగమతి వంటి సినిమాల తర్వాత ఆమె పాత్రల లెవెల్ పెరిగిపోయింది.. ఏది పడితే అది అంగీకరించలేని సిచువేషన్ ఏర్పడింది.. అయితే అలాంటి సమయంలోనే అనవసరంగా సైజ్ జీరో సినిమా చేసి తప్పు చేసింది.. బరువు పెరిగిన ఈమె వెండితెరకు అయిష్టత అయింది..

బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది.. కానీ మళ్ళీ పాత రూపాన్ని తెచ్చుకోలేక పోయింది.. మొన్నా మధ్య మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో ఆమెను చూస్తే ఆశ్చర్యం వేసింది.. ఈ వయసులో కూడా ఇమేజ్ దృష్ట్యా ఇతర హీరోయిన్ల లాగా పిచ్చి పాత్రలు చేయకుండా ఉమెన్ సెంట్రిక్ కథ అంగీకరించి సరైన నిర్ణయం తీసుకుంది. మరొకవైపు డైరెక్టర్ క్రిష్ కూడా దాదాపు అనుష్క వయసే.. 45 ఏళ్లు.. ఆమె కన్నా లేటుగానే ఇండస్ట్రీకి వచ్చాడు.. 2008లో గమ్యం నుంచి ఒక భిన్నమైన సెన్సిబుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు.. మంచి పేరుతో పాటు అవార్డులు కూడా వచ్చాయి..

- Advertisement -

2017లో బాలకృష్ణతో గౌతమీపుత్ర శాతకర్ణ సినిమా వరకూ.. చేసింది కొన్ని సినిమాలైనా దర్శకుడిగా మంచి పేరు దక్కించుకున్నారు.. అయితే ఎన్టీఆర్ బయోపిక్స్ కథానాయకుడు, మహానాయకుడు తీశాక దురదృష్టం పట్టుకుంది.. దీనికి తోడు మణికర్ణిక హిందీ సినిమా విషయంలో జరిగిన గొడవ ఆయన కెరియర్ కి మైనస్ అయింది.. కంగనా రనౌత్ తో పడిన గొడవ ఆయనను బాలీవుడ్ నుంచి వెళ్లగొట్టేలా చేసింది.. 2021 లో కొండ పొలం అనే చిన్న సినిమా వచ్చేవరకు ఆయన ఉన్నాడన్న విషయాన్ని ప్రేక్షకులు దాదాపు మరిచిపోయారు..

ఇక పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లుతో దాదాపు ఆయన రీయంట్రి అనుకోవచ్చు.. ఇది పెద్ద పాన్ ఇండియా సినిమా కదా.. కానీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరు చెప్పలేని పరిస్థితి.. ఇప్పుడు అనుష్కతో హీరోయిన్ సెంట్రిక్ సినిమా తీస్తున్నాడు అనే వార్త బయటకొచ్చింది ..ఇద్దరు ఒకే బాటలో ఉన్నారు. ఎగిరి విరిగిపడ్డ కెరటాలే.. నటనలో ఆమెకు, దర్శకత్వంలో ఆయనకు టన్నుల కొద్ది మెరిట్ ఎలాగో ఉంది కాబట్టి అప్పట్లో వీరిద్దరూ కలిసి చేసిన సినిమా ప్రశంసలు పొందింది. ఇప్పుడు మళ్ళీ వీరిద్దరు చేసే సినిమా ఎలా ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు