Kangana Ranaut : కంగనాకు ప్రధాని అయ్యే ఆలోచన ఉందా?

Kangana Ranaut

బాలీవుడ్ కాంట్రవర్సీ బ్యూటీ కంగనా రనౌత్ ఎప్పుడు తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పి వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇప్పటికే ఎన్నో వివాదాలను ఎదుర్కొన్న ఈ అమ్మడు పొలిటికల్ ఎంట్రీ గురించి తరచుగా చర్చ జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రధాని అయ్యే ఆలోచన ఉందా? అనే ప్రశ్న ఎదురు కాగా, దానికి సమాధానంగా ఆసక్తికరమైన సెటైర్ వేసింది ఈ బ్యూటీ. మరి ఇంతకీ కంగనా ఎలాంటి సమాధానం ఇచ్చింది? అంటే….

“రజాకర్ ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్” అనే మూవీ హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో తాజాగా జరిగింది. ఈ ఈవెంట్ కు బాలీవుడ్ స్టార్ కంగనా రనౌత్ ముఖ్య అతిథిగా హాజరైంది. అందులో భాగంగానే ఆమె పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. అయితే “ఏదో ఒక రోజు దేశానికి ప్రధాని కావాలనే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా మీకు? అనే ప్రశ్న ఎదురవ్వగా, దానికి సరైన సమాధానం ఇవ్వకుండా తన కొత్త మూవీ “ఎమర్జెన్సీ”ని ప్రమోట్ చేసుకుంది కంగనా. ఆ ప్రశ్నకు స్పందిస్తూ… తను “ఎమర్జెన్సీ” అనే ఒక సినిమా చేశానని, ఆ సినిమాను చూసిన తర్వాత తనను ఎవ్వరూ ప్రధానమంత్రి కావాలని కోరుకోరంటూ సెటైర్ వేసింది. “ఎమర్జెన్సీ” సినిమాలో కంగనా హీరోయిన్ గా నటించడం మాత్రమే కాకుండా, స్వయంగా దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలు కూడా తానే తీసుకుంది. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ ప్రధాన అంశంగా ఈ మూవీ రూపొందుతోంది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. తాజాగా ప్రధాన మంత్రి అయ్యే ఆలోచన ఉందా? అన్న ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం చూస్తే ఇన్ డైరెక్ట్ గా ఇందిరా గాంధీపై సెటైర్ వేసినట్టు అనిపిస్తోంది.

ఇక కంగనా పొలిటికల్ ఎంట్రీ అంశం ఎప్పుడూ ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఒకప్పుడు తాను ఎప్పటికీ రాజకీయాల్లోకి అడుగు పెట్టను అని క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చేసిన ఈ బ్యూటీ, మరోసారి మాత్రం దేవుడి దయ అంటూ దేవుడిపై భారం వేసింది. 2023 ఫిబ్రవరిలో తాను చాలా సెన్సిటివ్ మనిషినని, రాజకీయాలు తనకు సరిపడవని, చాలాసార్లు రాజకీయాల్లోకి రమ్మని పిలుపు వచ్చినా తాను ఒప్పుకోలేదని ట్వీట్ చేసింది. అదే ఏడాది నవంబర్ లో లోక్ సభ ఎన్నికల్లో పాల్గొంటారా? అనే ప్రశ్న ఎదురవ్వగా కంగనా స్పందించిన తీరు చర్చకు దారి తీసింది. శ్రీకృష్ణుడి దయ ఉంటే పోటీ చేస్తాను అంటూ సమాధానం చెప్పింది ఈ బ్యూటీ. దీంతో కంగనా పొలిటికల్ ఎంట్రీకి సిద్ధంగా ఉంది అని అంటున్నారు ఆమె అభిమానులు.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు