Hanuman vs Sri Anjaneyam : తప్పును ఒప్పుకున్న కృష్ణవంశీ… పోస్ట్ వైరల్

Hanuman vs Sri Anjaneyam

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ “హనుమాన్” మూవీని ప్రకటించినప్పటి నుంచి, రిలీజ్ అయ్యేదాకా ఏదో ఒక రకంగా హాట్ టాపిక్ గా మారుతూనే ఉంది. తాజాగా ఈ సినిమాను “శ్రీ ఆంజనేయం” మూవీతో పోలుస్తూ ఓ నెటిజన్ పోస్ట్ చేయగా, దానిపై డైరెక్టర్ కృష్ణ వంశీ స్పందించిన తీరు ఆసక్తికరంగా మారింది. ఇంతకీ “హనుమాన్” మూవీపై కృష్ణవంశీ రియాక్షన్ ఏమిటంటే?

2024 సంక్రాంతికి నాలుగు పెద్ద సినిమాలు విడుదలైనప్పటికీ పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న ఫస్ట్ ఇండియన్ సూపర్ హీరో మూవీ “హనుమాన్”. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, కుర్ర హీరో తేజ కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీ ఇప్పటికీ చాలా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా ఆడుతోంది. అయితే “హనుమాన్” మూవీ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా “శ్రీ ఆంజనేయం”తో పోలికలు పెడుతూ ఎంతోమంది నెటిజన్లు పోస్టులు పెడుతూ వస్తున్నారు. తాజాగా అలాంటి ఓ పోస్ట్ కు డైరెక్టర్ కృష్ణవంశీ నుంచి రియాక్షన్ రావడం హాట్ టాపిక్ గా మారింది.

“నాకెందుకో హనుమాన్ కంటే శ్రీ ఆంజనేయం మూవీనే బాగా నచ్చింది. ఎందుకో తెలియదు… సూపర్ సినిమా శ్రీ ఆంజనేయం.. కానీ పిచ్చి నా కొడుకులకు అర్థం కాలేదు” అంటూ తాజాగా ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. దానికి కృష్ణవంశీ స్పందిస్తూ ప్రేక్షకులది ఎప్పుడూ తప్పు కాదని, వాళ్లకు మూవీ నచ్చలేదు అంటే ఏదో తప్పు జరిగే ఉంటుందని, లేదా రీచ్ అవ్వడంలో సమస్య ఉండి ఉంటుందని రిప్లై ఇచ్చారు. అంతేకాదు ఈ కారణం చేతనే ఆడియన్స్ ను నిందించవద్దని, తాను కొన్ని పోర్షన్స్ లో తప్పు చేసి ఉంటానని ఆయన పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. దీంతో కృష్ణవంశీ స్పందించిన తీరుకు నెటిజెన్లు ఫిదా అవుతున్నారు.

- Advertisement -

Krishna Vamshi tweet about Sri Anjaneyam movie

హనుమాన్ వర్సెస్ శ్రీ ఆంజనేయం
ఈ రెండు సినిమాల కథలు దాదాపుగా ఒకే రీతిలో ఉంటాయి. నితిన్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన “శ్రీ ఆంజనేయం” మూవీ 2004లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ అప్పట్లో పెద్దగా ఆడలేదు. కానీ ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తుంది అంటే ఎగ్జైటింగ్ గా చూస్తారు ఆడియన్స్. మొత్తానికి తాజాగా “హనుమాన్” సక్సెస్ తరువాత మరోసారి “శ్రీ ఆంజనేయం” ప్రస్తావన రావడం విశేషం.

ఇక ఈ రెండు సినిమాల స్టోరీ విషయానికి వస్తే.. ఊరు తప్ప వేరే ప్రపంచం తెలియని ఒక కుర్రాడికి ఆ ఊర్లో జరిగే అక్రమాలను ఎదిరించే ధైర్యం ఉండదు. ఆ తర్వాత హనుమంతుడే స్వయంగా దిగివచ్చి హీరోకు తన శక్తులు ఇస్తాడు. అయితే శ్రీ ఆంజనేయం సినిమాలో నితిన్ ఆంజనేయ స్వామి భక్తుడిగా నటిస్తే, హనుమాన్ మూవీలో తేజ దొంగగా కనిపించాడు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు