Raveena Tandon: ఒకప్పుడు పనిమనిషి.. ఇప్పుడు స్టార్ హోదా.. రవీనా సక్సెస్ వెనుక ఇన్ని కష్టాలా..?

ప్రముఖ బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ రవినాటాండన్ ఒకప్పుడు ఎన్నో కష్టాలను ఎదుర్కొని.. నేడు స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకోవడమే కాదు బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్ గా కూడా నిలిచింది.. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రవీనా టాండన్ ఇండస్ట్రీలోకి రాకముందు.. వచ్చిన తర్వాత ఎలాంటి కష్టాలను అనుభవించిందో.. ఒక్కొక్కటిగా మీడియాతో పంచుకుంది.. అవేంటో ఇప్పుడు చూద్దాం..

స్టార్ సెలబ్రిటీల కష్టాలు..
ప్రస్తుతం అయితే సినీ ఇండస్ట్రీలో నెపోటిజం చాలా ఎక్కువగా కనిపిస్తుందని అంటూ ఉంటారు.. దీని కారణంగానే చాలామంది స్టార్ హీరోలుగా, హీరోయిన్లుగా మారారని కూడా అంటారు.. కానీ కష్టపడకుండా.. అదృష్టం లేకుండా ఎవరూ ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉండలేరు.. ఈ క్రమంలోనే రవీనాటాండన్ కూడా ఒకప్పుడు స్టూడియోలు వూడ్చింది అంటే ఎవరైనా నమ్ముతారా.. సినీ నేపథ్యం ఉన్నప్పటికీ కూడా స్టూడియో ఫ్లోర్లను శుభ్రం చేసి.. ఒకప్పుడు పనిమనిషిగా కూడా చేసింది.. అయితే ఇప్పుడు స్టార్ గా ఎదిగి 49 సంవత్సరాల వయసులో ఇప్పటికీ వెండి తెరను శాసిస్తోంది ఈ ముద్దుగుమ్మ.. హిందీలో తన నటన నైపుణ్యాన్ని చాటి వెండితెరపై వెలుగులు వెలిగిన తర్వాత ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతోంది..

ఇంటర్వ్యూలో రవీనా..
కెరియర్ ప్రారంభంలో స్టూడియో ఫ్లోర్లను శుభ్రం చేశాను.. స్టాల్ ఫ్లోర్ లు, స్టూడియో ఫ్లోర్ల నుండి వాంతులు కూడా శుభ్రం చేయడం చేశాను.. నేను ప్రహ్లాద్ కక్కర్ కి సహాయం కూడా చేశాను.. ఆ సమయంలో కూడా మీరు తెర వెనుక ఏం చేస్తున్నారు ..? మీరు స్క్రీన్ ముందు ఉండాలి..? అది మీకోసం అనేవారు.. అయితే నేను మాత్రం వద్దు.. కాదు… నేను నటినా అని అంటూ ఉండేదాన్ని.. అయితే అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చాను.. నటిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదు.. సల్మాన్ ఖాన్ నటించిన పత్తర్ కే ఫూల్ సినిమాతో మొదటి బ్రేక్ వచ్చింది. ఈ సినిమా కమర్షియల్ హిట్ అవడం తో రాత్రికి రాత్రి స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్నాను అంటూ తెలిపింది రవీనా..

- Advertisement -

రవీనా బ్యాక్ గ్రౌండ్..
వాంతులు వూడ్చాను.. ఫ్లోర్ తుడిచాను..ప్రముఖ సినీ నిర్మాతలు రవి టాండన్ , వీణా టాండన్ ల కుమార్తె రవీనాటాండన్.. ఈమెకు తన తండ్రి సినీ నేపథ్యం నుండి ఎటువంటి సపోర్టు లభించలేదు.. దీంతో పనిమనిషిగా ఇండస్ట్రీలో పనిచేసి.. ఆ తర్వాత స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకుంది.. 90వ దశకంలో బాలీవుడ్ లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా చలామణి అయిన ఈమె అత్యధిక పారితోషకం పొందిన హీరోయిన్గా కూడా పేరు దక్కించుకుంది.. అంతేకాదు ఉత్తమ నటిగా ప్రతిష్టాత్మక జాతీయ చలనచిత్ర అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు.. కన్నడ చిత్రం కేజిఎఫ్ 2 లో ప్రధానమంత్రి పాత్రను పోషించి ప్రేక్షకులను అలరించింది.. ఇక అలా ఒకప్పుడు అన్ని కష్టాలను, అవమానాలను కూడా ఎదుర్కొన్న ఈమె నేడు ఈ స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోవడంతో అందరూ ఈమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు