Meena: రజనీతో అది మిస్ అవడం బాధగా వుంది…ఆమె వల్లే – మీనా ఘాటు వ్యాఖ్యలు..!

సాధారణంగా సినిమా కథలు రాసుకునేటప్పుడు దర్శకులు, రచయితలు కొంతమంది హీరోలను, హీరోయిన్లను ఆ పాత్రలలో ఊహించుకుంటూ కథను రాస్తూ ఉంటారు.. అయితే ఒక్కొక్కసారి ఆ కథలో మార్పులు చేర్పుల కారణంగా అందులో వేరే వారు వచ్చి చేరతారు.. మరికొన్నిసార్లు ఆ కథలను తామనుకున్న నటీనటులకు వినిపించిన తర్వాత వారు ఒప్పుకోకపోతే వేరొకరికి అవకాశం ఇస్తారు.. అయితే ఆ సినిమా ఒకవేళ సక్సెస్ అయ్యి ఆ పాత్రలకు మంచి పేరు వస్తే మాత్రం ఆ పాత్రలు మిస్ చేసుకున్నందుకు ఆ నటీనటులు ఎంత బాధ పడతారంటే ఎప్పటికీ ఆ విషయాన్ని మీడియాతో వెల్లడిస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే ప్రముఖ స్టార్ హీరోయిన్ మీనా కూడా అలాంటి ఒక అద్భుతమైన పాత్రను మిస్ చేసుకుని ఇప్పటికీ ఎమోషనల్ అవుతోంది ఈ ముద్దుగుమ్మ.. మరి మీనా మిస్ చేసుకున్న పాత్ర ఏంటి? ఎందుకు మిస్ చేసుకుంది ?అన్న విషయాలు ఇప్పుడు చూద్దాం..

తెలుగులో మిస్ చేసుకున్న సినిమాలు..
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనా మాట్లాడుతూ.. తెలుగులో నేను మిస్ చేసుకుని బాధపడిన సినిమా నిన్నే పెళ్ళాడుతా.. ఇందులో ఈ సినిమా డైరెక్టర్ వంశీ నువ్వే చేయాలి అని అడిగాడు.. కానీ 65 రోజులు డేట్లు అడిగాడు. అప్పుడు 25 రోజుల్లో అయిపోయే సినిమాకి 65 రోజులు అడుగుతున్నారే.. ఎలా ఇచ్చేది.. నేను అప్పటికి ఇంకో సినిమాకి కమిట్ అయి ఉన్నాను.. అక్కడ కమిట్ అవ్వకపోతే 60 రోజులు కంటే ఎక్కువగానే ఇచ్చేదాన్ని.. కమిట్ అయిన సినిమా నుంచి ఇక్కడికి అక్కడికి తిరగలేను కదా.. 15 రోజులైతే ఇవ్వొచ్చు తర్వాత ఏంటి పరిస్థితి.. ఒకవేళ ఒప్పుకున్నాక చేయకపోతే అది వేరేలా ఉంటుంది.. అందుకే నేను ఆ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు..

నీలాంబరి పాత్ర..

- Advertisement -

ఆ పాత్రను మిస్ అవ్వడం చాలా బాధేసింది..అంతేకాదు నరసింహాలో రమ్యకృష్ణ నటించిన నీలాంబరి పాత్రకి కూడా నన్నే అడిగారు.. కానీ మా అమ్మ నాకు ఆ క్యారెక్టర్ సూట్ అవ్వదు అని చెప్పింది.. ఆ సమయంలో నేను చాలా హోమ్లీ పాత్రలు మాత్రమే చేశాను.. అదే కాకుండా అప్పటికే రజనీకాంత్ తో చాలా సినిమాలు చేశాను.. పైగా ముత్తు సినిమా చేయగా అది జపాన్లో కూడా సూపర్ హిట్ గా నిలిచింది. తమిళనాడులో అప్పట్లో మా ఇద్దరి జంట కి మంచి పేరు వుంది.. ఆ టైములో ఈ క్యారెక్టర్ సరికాదు అని అమ్మ చెప్పింది ..కానీ నాకు ఆ పాత్ర చేయాలని ఉండేది.. చాలా డిఫరెంట్ పాత్ర.. ఆ తర్వాత సౌందర్య క్యారెక్టర్ చేస్తారా అని అడిగినా కూడా.. చేస్తే రమ్య కృష్ణ పాత్రనే చేస్తాను లేకపోతే చేయనని చెప్పాను.. కానీ అమ్మ ఒప్పుకోకపోయేసరికి ఆ క్యారెక్టర్ అలా మిస్ అయింది.. ఇక ఆ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత చాలా బాధ వేసింది.. ఆ తర్వాత ఒకరకంగా సంతోషం కూడా వేసింది ఎందుకంటే నేను ఆ పాత్ర మిస్ అయ్యాను అని కాదు కానీ నాకంటే రమ్యకృష్ణ చాలా బాగా చేసింది అంటూ చెప్పుకొచ్చింది మీనా.. మొత్తానికైతే రజినీకాంత్ తో విలన్ గా చేసే అవకాశాన్ని కోల్పోయానని చెప్పి బాధపడింది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు