Ustaad Bhagat Singh : గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం… అనుకున్నట్టే పొలిటికల్ టచ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి తమ్ముడుగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు పవన్. అయితే చిరు తమ్ముడుగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ తనకంటూ తర్వాత తర్వాత ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా తర్వాత వరుసగా ఖుషి సినిమా వరకు హిట్ పైన హిట్ల అందుకున్నాడు పవన్.

పవన్ కెరియర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. పవన్ స్టార్టింగ్ లో చేసిన తమ్ముడు, బద్రి, ఖుషి, తొలిప్రేమ సినిమాలు యూత్ లో ఒక క్రేజ్ ని క్రియేట్ చేశాయి. చాలామంది అక్కడితోనే పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ అయిపోయారు. అయితే ఖుషి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తనలోని దర్శకుడును కూడా బయటికి తీసి జానీ అనే సినిమాకు డైరెక్షన్ చేశాడు. కానీ జానీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. ఆ సినిమా తర్వాత దాదాపు 10 ఏళ్ల వరకు పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఒక హిట్ సినిమా కూడా లేదు.

మళ్లీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జల్సా సినిమా మంచి రిజల్ట్ తెచ్చిపెట్టింది. అయితే పవన్ ఫ్యాన్స్ కి సంతృప్తినిచ్చింది మాత్రం హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా అని చెప్పొచ్చు. గబ్బర్ సింగ్ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అప్పటివరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న రికార్డ్లు అన్నిటిని తిరగరాసింది గబ్బర్ సింగ్ సినిమా. ఒక సగటు అభిమాని పవన్ కళ్యాణ్ ని ఎలా చూడాలనుకుంటాడో అలా చూపించి ఆ సినిమాను అద్భుతంగా తీసాడు దర్శకుడు హరీష్ శంకర్.

- Advertisement -

ఇకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా కూడా అద్భుతమైన ఘనవిజయం సాధించింది. మీరు హ్యాట్రిక్ కాంబినేషన్లో అజ్ఞాతవాసి అనే సినిమా వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించలేదు. పవన్ కళ్యాణ్ కెరియర్ లో 25వ సినిమాగా వచ్చిన ఈ సినిమా తర్వాత పవన్ సినిమాలకు కొంతవరకు గ్యాప్ ఇచ్చాడు. మళ్లీ వకీల్ సాబ్ సినిమాతో రీయంట్రి ఇచ్చి సినిమాలు చేశాడు పవన్ కళ్యాణ్.

ఉస్తాద్ భగత్ సింగ్ ఇలా మారిపోయింది…

అయితే పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత ఎన్నో సినిమాలకు సైన్ చేశాడు. వాటన్నిటిలో ఆసక్తికరమైన ప్రాజెక్టు మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్పొచ్చు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ సినిమా తేరి కి రీమేక్ గా తెరకెక్కుతుంది. అయితే హరీష్ రీమిక్ సినిమాలు చేసినా కూడా దాన్ని కూడా కొత్తగా చేయడం హరీష్ స్టైల్.

సర్ప్రైజ్ గ్లింప్స్…

ఇకపోతే రీసెంట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి రిలీజ్ చేసిన ఒక వీడియో కూడా అందరికీ మంచి హై ఇచ్చింది. ఇప్పుడు తాజాగా మరో వీడియోని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. వన్ మినిట్ నిడివి ఉన్న ఈ వీడియో పవన్ ఫ్యాన్స్ ను అద్భుతంగా ఆకట్టుకుంటుంది అని చెప్పొచ్చు. అన్నిటిని మించి హరీష్ శంకర్ రాసిన డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. పవన్ పార్టీ సింబల్ అయినా ఒక గాజు గ్లాస్ ను కిందపడేసి ని రేంజ్ ఇది అని విలన్ చెప్పినప్పుడు. గాజు పగిలేకొద్ది పదునెక్కుద్ది చెప్పుకొచ్చాడు. ఇటువైపు సినిమాకి అటువైపు చాలామంది రాజకీయంగా విమర్శలు చేసే వ్యక్తులకి ఈ డైలాగ్ ఒక సమాధానంగా హరీష్ రాశాడు అని చెప్పొచ్చు. ఏదేమైనా ఈసారి కూడా హరీష్ శంకర్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఇవ్వనున్నట్లు అర్థమవుతుంది.

Check out Filmify for the latest Tollywood news in Telugu and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు