Harish Shankar: మరో యంగ్ దర్శకుడితో చేయి కలపనున్న మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి.. ఈయన తో సినిమా చేయాలని చాలామంది దర్శకులు కలలు కంటూ ఉంటారు. కానీ ఆ కలలు కలలుగానే మిగిలిపోతాయి. అయితే ఊహించిన విధంగా మెగాస్టార్ రీఎంట్రీ తర్వాత చాలామంది యంగ్ దర్శకులకు అవకాశాలు ఇస్తున్నారు. మెగాస్టార్ సినిమాలు చూస్తూ పెరిగిన దర్శకులంతా నేడు మెగాస్టార్ తో సినిమాలు చేస్తున్నారు. మెగాస్టార్ సినిమాలకు గ్యాప్ ఇచ్చిన తరుణంలో ఎదిగిన దర్శకులు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎప్పటినుంచో మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని కలలు కన్నారు. వాటిలో కొన్ని సినిమాలు పూజ వరకు వెళ్లి ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇంకొన్ని సినిమాలు అనౌన్స్ చేసి ఇంకా పట్టాలెక్కని సినిమాలు కూడా ఉన్నాయి.

పూరి జగన్నాథ్ మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో సినిమా వస్తుందని ఎన్నో ఏళ్ల క్రిందట అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 కంటే ముందు ఆటో జానీ అనే సినిమా మెగాస్టార్ చిరంజీవి చేయనున్నట్లు అధికారికి ప్రకటన కూడా వచ్చింది. అయితే మెగాస్టార్ ఈ మూవీలో సెకండాఫ్ విషయంలో కొన్ని చేంజస్ చెప్పడంతో ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఆ తర్వాత పూరి జగన్నాథ్ చేయాల్సిన రీఎంట్రీ ఫిల్మ్ అలా పెండింగ్ లో పడిపోయింది.

ఆ తర్వాత తమిళ్లో రిలీజ్ అయి పెద్ద హిట్ అయిన కత్తి సినిమా తెలుగులో “ఖైదీ నెంబర్ 150” గా రీమేకై విడుదలైంది. సినిమా కూడా మెగాస్టార్ కం బ్యాక్ కి మంచి ప్లస్ అయిందని చెప్పొచ్చు. కానీ ఆ తర్వాత పూరి కాంబినేషన్ లో సినిమా జరుగుతుందని అనుకున్నారు కానీ అది ఇప్పటివరకు పట్టాలెక్కలేదు.

- Advertisement -

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా, మెగాస్టార్ హీరోగా, డీవీడీ దానయ్య ప్రొడ్యూసర్ గా ఒక సినిమా ఉండబోతుంది అంటూ మెగాస్టార్ చిరంజీవి వినయ విధేయ రామ ఆడియో లాంచ్ లో అనౌన్స్ చేశారు. కానీ ఆ సినిమా గురించి ఇప్పటివరకు ఒక అప్డేట్ కాదు కదా, అసలు ఏమి చెప్పకుండా కనీసం ఆ ప్రస్తావని కూడా తీసుకురాలేదు. మెగాస్టార్ ప్రస్తుతం యంగ్ హీరోస్ తో పనిచేస్తున్నారు. వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం మెగాస్టార్ బింబిసారా సినిమాతో మంచి హిట్ అందుకున్న వశిష్ట తో సినిమా చేస్తున్నారు. దీనికి విశ్వంభర అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. ఈ సినిమా సంక్రాంతి పండుగకు విడుదల కానుంది.

పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ లాంటి దర్శకులకు మెగాస్టార్ తో పనిచేసే అవకాశం దక్కకపోయినా కూడా కొరటాల శివకు మెగాస్టార్ తో పనిచేసే అవకాశం దక్కింది. కానీ ఎవరు ఊహించని విధంగా ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి మరో యంగ్ దర్శకుడికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు దర్శకుడు హరీష్ శంకర్. హరీష్ ఇప్పుడు మెగాస్టార్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి బీవీఎస్ రవి కథ అందించబోతున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల తో పాటు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారి ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు