Toxic : పూజా దురదృష్టం మామూలుగా లేదు… “టాక్సిక్” ఛాన్స్ మిస్

బుట్ట బొమ్మ పూజా హెగ్డే తలపై ఈమధ్య దరిద్ర దేవత తాండవిస్తున్నట్టుగా అన్పిస్తోంది. అసలే అవకాశాలు లేక సతమతమవుతున్న పూజ హెగ్డే చేతిలో ఉన్న అవకాశాలను కూడా కోల్పోవాల్సి వస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న పోటీని తట్టుకోవడం ఈ బ్యూటీకి కష్టతరంగా మారింది. తాజాగా యష్ సరసన “టాక్సిక్” అనే మూవీలో నటించే అవకాశం రాగా, మరో హీరోయిన్ శృతి హాసన్ ఆ అవకాశాన్ని లాగేసుకున్నట్టు సమాచారం.

“కేజిఎఫ్ 2” తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న యష్ రీసెంట్ గా “టాక్సిక్” అనే పాన్ ఇండియా మూవీని ప్రకటించిన విషయం తెలిసిందే. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందనుంది. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో గ్లోబల్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అన్న విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలోనే తాజా సమాచారం ప్రకారం “టాక్సిక్” సినిమాలో నటించే అద్భుతమైన అవకాశాన్ని పూజ హెగ్డే కోల్పోయిందని తెలుస్తోంది. ముందుగా ఈ భారీ బడ్జెట్ మూవీలో హీరోయిన్ గా పూజ హెగ్డేను అనుకున్నారని, కానీ శృతిహాసన్ కారణంగా ఆ అవకాశం చేజారింది అని తెలుస్తోంది. గత కొంతకాలంగా “టాక్సిక్” మూవీలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించబోతుందన్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కానీ మేకర్స్ ఇంకా ఈ మూవీలో హీరోయిన్ ఎవరు అన్న విషయంపై అధికారికంగా అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. కానీ “టాక్సిక్” హీరోయిన్ల విషయంలో ఫిలింనగర్ సర్కిల్స్ లో మాత్రం పలు ఆసక్తికరమైన వార్తలు వైరల్ అవుతున్నాయి.

చాపకింద నీరులా సైలెంట్ గా శృతి హాసన్ పెద్ద సినిమాల అవకాశాలను చేజిక్కించుకుంటుంది. గత ఏడాది ఈ బ్యూటీ నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో కొత్త సినిమాల అవకాశాలు శృతిహాసన్ ఇంటి తలుపు తడుతున్నాయి. రీసెంట్ గా “సలార్” మూవీతో పాన్ ఇండియా హీరోయిన్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంది శృతి. ఈ మూవీ కారణంగానే “టాక్సిక్” మూవీలో పూజ హెగ్డేను పక్కనపెట్టి శృతిహాసన్ ను హీరోయిన్ గా తీసుకున్నారట మేకర్స్. ప్రస్తుతం శృతిహాసన్ చేతిలో డెకాయిట్, సలార్ పార్ట్ 2 వంటి భారీ అంచనాలున్న సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు వీటితోపాటు “టాక్సిక్” కూడా చేరిపోయింది. కానీ ఈ ప్రాజెక్టు గురించి ఇంకా మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోపక్క వరుస డిజాస్టర్లు అందుకుని అవకాశాల కోసం ఎదురు చూస్తున్న పూజ హెగ్డే చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన “గుంటూరు కారం” సినిమాలో కూడా ముందుగా పూజ హెగ్డేనే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ పలు కారణాలవల్ల ఈ బ్యూటీ ఈ సినిమా నుంచి కూడా తప్పుకోక తప్పలేదు. ఇదంతా చూస్తుంటే పూజా దురదృష్టం మామూలుగా లేదుగా అన్పిస్తోంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు