RC16 : అనుకున్నది సాధించిన బుచ్చిబాబు..

బుచ్చిబాబు రెండున్నరేళ్ల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బుచ్చిబాబు దర్శకత్వంలో చేయబోతున్న RC16 సినిమా ఎట్టకేలకు మొదలయ్యింది. మార్చి20న పూజా కార్యక్రమాలతో సినిమాను గ్రాండ్ గా అధికారికంగా లాంచ్ చేశారు. అయితే ఎంతో కాలంగా దర్శకుడు బుచ్చిబాబు ఈ ప్రాజెక్టును పట్టాలు ఎక్కించడానికి ఎదురుచూస్తూ ఉన్నాడు. బుచ్చిబాబు తొలి సినిమా ఉప్పెన వచ్చి దాదాపు మూడేళ్లకు పైనే అయ్యింది. అయితే రామ్ చరణ్ తో ఈ సినిమా మొదలయ్యే ఈ మూడేళ్ళ కాలంలో బుచ్చిబాబుకి చాలా రకాల ఆఫర్స్ వచ్చాయి. కానీ తర్వాత చేస్తే ఖచ్చితంగా పెద్ద హీరోతోనే సినిమా చేయాలి అనే పట్టుదలతో ఎంతో ఓపికతో కథను సిద్ధం చేసుకున్నాడు. మొత్తానికి అనుకున్నట్లుగానే రామ్ చరణ్ తో సినిమాను పట్టాలు ఎక్కిస్తున్నాడు.

మహారథుల సమక్షంలో గ్రాండ్ లాంచ్..

ఇక రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా ఈరోజు టాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్స్ సమక్షంలో గ్రాండ్ గా మొదలయింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా RC16 ప్రారంభోత్సవం జరిగింది. ఇక ఈ సినిమా లాంచ్ వేడుకలో బుచ్చిబాబు ఇండియా వైడ్ గా ఫేమస్ అయిన స్టార్లతో కనిపించడం హైలైట్ గా నిలిచిందని చెప్పొచ్చు. ఈ కార్యక్రమంలో చిరంజీవి తో పాటు హీరోహీరోయిన్లు రామ్ చరణ్ జాన్వీ కపూర్, సంగీత దర్శకుడు ఏఆర్ రహ్మాన్, అలాగే బోణి కపూర్, సుకుమార్, శంకర్ షణ్ముగం, అల్లు అరవింద్, అలాగే మైత్రి నిర్మాతలు హాజరవడం జరిగింది. ఇక ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. సాధారణంగా రెహమాన్ ను ఒప్పించడం అంత ఈజీ కాదు. ఆయన కంటెంట్ నచ్చితేనే సినిమాలు ఒప్పుకుంటారు. కానీ చాలా రోజుల తర్వాత ఒక తెలుగు సినిమాకు రహమాన్ ఒప్పుకోవడం, బుచ్చిబాబు రెండవ సినిమా అయినప్పటికీ అతని స్క్రిప్ట్ విన్న వెంటనే రెహమాన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మామూలు విషయం కాదు.

- Advertisement -

ఇక వృద్ధి సినిమాస్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మొత్తానికి దర్శకుడు తన రెండవ సినిమా లాంచ్ వేడుకలోనే బిగ్గెస్ట్ స్టార్స్ ను రంగంలోకి దింపాడు. ఇక ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు ఇంతకు ముందు ఆయనే ఓ ఇంటర్వ్యూ లో చెప్పడం జరిగింది. ఇక రెహమాన్ కూడా చాలా కాలం తర్వాత ఒక తెలుగు సినిమాకు మ్యూజిక్ అందిస్తూ ఉండడం విశేషం. ఇక ఈ సినిమా ప్రారంభోత్సవంలో బుచ్చిబాబు గురువు సుకుమార్ మాట్లాడుతూ తన శిష్యుడు చరణ్ ని ఒప్పిస్తాడని ఊహించలేదని, ఏఆర్ రెహమాన్ తో మ్యూజిక్ అనగానే షాక్ కొట్టిందనే రేంజ్ లో చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక రెహమాన్ అయితే ఏకంగా బుచ్చిబాబుని ప్యాషన్ ఉన్న సినిమా పిచ్చోడిగా వర్ణించడం హైలైట్. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ లో మొదలవుతుందని సమాచారం. మేకర్స్ వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనే ఆలోచనతో ఉన్నారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు