RC16 : తారక్ కథతో చరణా? సుక్కూ క్లారిటీ..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా ఎట్టకేలకు మొదలైంది. టాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ మేకర్స్ సమక్షంలో గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ ఈవెంట్ లో నటీనటులతో పాటు ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన వారు కూడా తమ స్పీచ్ లతో ఇంట్రెస్టింగ్ విషయాలు మీడియాతో పంచుకున్నారు. నిజం చెప్పాలంటే ఈ ఈవెంట్ లో ఒక్కో టెక్నిషియన్ స్పీచ్ ఒక్కో విషయాన్ని సినిమా విశేషాలని పంచుకున్నారు. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకి ఓ వారం ముందు నుంచే తన పుట్టినరోజు గిఫ్ట్స్ ఇచ్చేసాడని చెప్పొచ్చు. ఇక యువ దర్శకుడు బుచ్చిబాబు సానా తో చరణ్ కెరీర్ లో తన 16వ సినిమాని గ్రాండ్ గా లాంచ్ చేయగా దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా విషయంలో గత కొన్నాళ్ల నుంచి కొన్ని రూమర్స్ వస్తూనే ఉన్నాయి.

ఎన్టీఆర్ కథతో చరణ్ అని?

దర్శకుడు బుచ్చిబాబు ఉప్పెన తర్వాత తన నెక్స్ట్ సినిమా ఏ స్టార్ హీరోతో చేస్తాడో అని రకరకాల వార్తలు వచ్చాయి. నిజానికి బుచ్చిబాబు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా చేరినప్పటినుండి చాలా మంది స్టార్ హీరోలతో మంచి సాన్నిహిత్యం ఏర్పరచుకున్నాడు. చరణ్ తో పాటు తారక్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్లతో పరిచయం ఏర్పరచుకున్నాడు. అయితే ఈ క్రమంలో ఉప్పెన తర్వాత బుచ్చిబాబు ఏ స్టార్ హీరోతో సినిమా చేస్తాడో అని వెయిట్ చేసారు ఆడియన్స్. ఫైనల్ గా రామ్ చరణ్ తో సినిమా స్టార్ట్ చేసాడు. అయితే అప్పట్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు సిద్ధం చేసిన కథే ఇప్పుడు రామ్ చరణ్ వద్దకి వెళ్ళింది అని కొన్ని పుకార్లు వచ్చాయి. దీనితో చాలా మంది అదే నిజం అనుకున్నారు కానీ దీనిపై అసలు క్లారిటీ ఇవాళే వచ్చింది. లెక్కల మాస్టారు సుకుమార్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

- Advertisement -

అసలు కథ ఇది! క్లారిటీ ఇచ్చిన సుక్కూ!

రామ్ చరణ్ RC16 పై బుచ్చిబాబు కథ గురించి క్లారిటీ ఇస్తూ సుకుమార్ మాట్లాడడం జరిగింది. సుకుమార్ మాట్లాడుతూ ఈ సినిమా కథని చరణ్ కోసం బుచ్చిబాబు ఎప్పుడో “రంగస్థలం” టైం లోనే, అంటే ఏడేళ్ల కిందటే సిద్ధం చేసుకున్నాడని, అప్పటికి ఇంకా తన డెబ్యూ చిత్రం “ఉప్పెన” కంటే ముందే ఈ కథ ప్రిపేర్ చేసుకున్నట్టుగా సుకుమార్ రివీల్ చేశారు. అప్పట్లోనే చరణ్ ని కథకి ఒప్పించాడని, అది కార్యరూపం దాల్చడానికి ఇన్నాళ్లు పట్టిందని అన్నారు. ఇక అప్పుటి నుంచే బుచ్చిబాబు రామ్ చరణ్ తో సినిమా చేయాలని బలంగా డిసైడ్ అయ్యిపోయాడు. దీనితో తారక్ సినిమాకి ఈ సినిమాకి సంబంధం లేదనే చెప్పాలి. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ లో రెగ్యులర్ షూట్ మొదలవనుంది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు