NagaChaitanya : దూత సీక్వెల్ పై నిరాశలో ఫ్యాన్స్.. కారణమేంటంటే?

అక్కినేని నాగచైతన్య హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన మిస్టరీ థ్రిల్లర్‌ ధూత వెబ్ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుందన్న విషయం తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో వచ్చిన దూత సీజన్ 1 వెబ్ సిరీస్ సూపర్ సక్సెస్ అవడంతో రెండో సీజన్ కూడా రానుందని కొంతకాలంగా టాక్ వినిపించగా, రీసెంట్ గా నాగ చైతన్య రిలీజ్ చేసిన ఓ వీడియో ద్వారా ధూత సీజన్ 2 గురించి ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటించేందుకు రెడీ అవుతున్నట్టు అనుకున్నారు. ఇక రిలీజ్ చేసిన ఆ వీడియో లో నాగచైతన్య న్యూస్ పేపర్ చదువుతున్నట్టుగా ఆ వీడియోలో ఉండగా, ఆ పేపర్‌పై పెద్దగా మార్చి 19 అని రాసి ఉంది. అప్పుడు “కన్‍ఫ్యూజ్ అవుతున్నారా? ఇంకా క్లూస్ కావాలా? మరి మార్చి 19న మీరు రెడీనా?” అని నాగచైతన్య అన్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు చాలా మంది ధూత2 అప్డేట్ గురించే అని అనుకున్నారు. ఎందుకంటే ఈ అనౌన్స్ మెంట్ అమెజాన్ ప్రైమ్ నుండి వచ్చింది కాబట్టి, అందులోనూ నాగ చైతన్య పేపర్ చదువుతూ హింట్ ఇచ్చాడు కాబట్టి ధూత2 సిరీస్ అప్డేట్ అనే అనుకోవచ్చు.

ధూత అప్డేట్ పై నిరాశ..

నాగ చైతన్య డిజిటల్ డెబ్యూ అయిన దూత వెబ్ సిరీస్ కు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలతో వరస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ఇదే పెద్ద ఊరట కలిగించింది. ఇక దూత పై అమెజాన్ ప్రైమ్ కంటెంట్ లాంచ్ ఈవెంట్ లో దీనికి సీక్వెల్ ప్రకటిస్తారనే ఊహాగానాలు బలంగా వచ్చాయి. చైతు అందుకే హాజరవుతున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ అలాంటి ఆశలు పెట్టుకున్న వాళ్లకు నిరాశ కలిగిస్తూ దూత 2ని ప్రకటించలేదు. సక్సెస్ చేసినందుకు హీరో డైరెక్టర్ ని పిలిచి థాంక్స్ చెప్పి పంపించారు తప్ప ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అయితే దీని వెనుక పలు కారణాలున్నాయి.

- Advertisement -

దూత సిరీస్ అనౌన్స్ చేయకపోవడానికి కారణమిదేనా?

దూత సీక్వెల్ అనౌన్స్ మెంట్ అమెజాన్ వేదికపై చేయనందుకు చై ఫ్యాన్స్ నిరాశపడ్డారని తెలుస్తుంది. అయితే దీనికి కారణాలు లేకపోలేదు. ఒక్కసారి ఆలోచిస్తే.. చైతన్య ఓటిటి స్పేస్ లో కంటిన్యూ కావాలని కోరుకోవడం లేదని సమాచారం. దూతకు డిమాండ్ ఉన్నా సరే కొంత గ్యాప్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు తాను చేస్తున్న తండేల్ మీద భారీ నమ్మకంతో కేవలం ప్రీ ప్రొడక్షన్ కోసమే ఏడాది వెయిట్ చేశాడు. ఎలాగైనా హిట్టుకొట్టాలని మేకోవర్ చేసుకున్నాడు. అయితే హిందీలో లాగా స్టార్ హీరోలు ఒకే టైంలో థియేటర్, ఓటిటిలో నటిస్తే వర్కౌట్ కాదు. ఇమేజ్ తో పాటు మార్కెట్ సమస్యలు వస్తాయి. పదే పదే చిన్ని తెరపై కనిపిస్తూ ఉంటే బిగ్ స్క్రీన్ ఎగ్జైట్ మెంట్ తగ్గిపోతుంది. ఇప్పుడు నాగ చైతన్య అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడు.

ఇక ఇటు దర్శకుడు విక్రమ్ కుమార్ కు వేరే కమిట్ మెంట్స్ ఉన్నాయి. ఇష్క్ కాంబోని నితిన్ తో కలిసి పదిహేను సంవత్సరాల తర్వాత రిపీట్ చేయబోతున్నాడు. ఇది కాకుండా నాగార్జునతో కూడా ఓ సినిమా చేయబోతున్నాడని సమాచారం. ఇక మరో మీడియం రేంజ్ హీరోతో సినిమా తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవన్నీ జరగాలంటే చాలా టైం పట్టుద్ది. అందువల్ల దూత 2 కోసం ఇప్పట్లో టైం లేదు. అయితే భవిష్యత్తులో దూత బ్యాక్ డ్రాప్ లో మరో నాలుగు కథలు సిద్ధం చేస్తానని, సమయం దొరికినప్పుడు తెరకెక్కిస్తానని విక్రమ్ కుమార్ అంటున్నారు. ఇక ఆ సీక్వెల్స్ లో నాగ చైతన్యనే ఉంటాడో లేక వేరే హీరోలతో ట్రై చేస్తాడో వేచి చూడాలి. ఓవరాల్ గా దూత 2 వెబ్ సిరీస్ లేనట్టే అనిచెప్పాలి.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు