Mehreen Pirzada : గ్లామర్ షో తో ఆఫర్లకు వల..

టాలీవుడ్ లో గ్లామర్ డాల్ మెహ్రీన్ పిర్జాదా గురించి ప్రత్యకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో క్యూట్ గా హీరోయిన్లలో మెహ్రిన్ పిర్జాదా ముందు ప్లేస్ లో ఉంటుంది. ఎనిమిదేళ్ల కింద కృష్ణ గాడి వీర ప్రేమగాథ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైనా ఈ భామ తొలి సినిమాతోనే చాలా మంది ఆడియన్స్ క్రష్ లిస్ట్ లలో జాయిన్ అయింది ఈ భామ. ఆ తర్వాత వరుస హిట్లతో గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. చూడ్డానికి కాజల్ డూప్ లా కూడా అనిపించడంతో మొదట్లో వరుస అవకాశాలు వచ్చాయి. అయితే ఆ తర్వాత వరుస ప్లాపులు పలకరించడం తో ఛాన్సులు తగ్గుముఖం పట్టాయి. పైగా ఎక్కువగా చిన్న సినిమాలు మీడియం రేంజ్ హీరోల సినిమాల్లోనే ఛాన్సులు వచ్చేవి. క్రమంగా వరుస బెట్టి సినిమాలు ప్లాప్ అవుతుండడంతో ఈ అమ్మడి క్రేజ్ డౌన్ అవుతూ వచ్చింది.

వరుస ప్లాప్ లతో నో ఆఫర్స్..

ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ గాను సినిమాలు చేయడం స్టార్ట్ చేసింది. అయినా ఈ అమ్మడి ఫేట్ మారలేదు. ఇక చివరగా రెండేళ్ల కింద F3 సినిమాతో మెహ్రిన్ యావరేజ్ హిట్టు కొట్టగా, లాస్ట్ ఇయర్ స్పార్క్ అనే సినిమా చేసింది. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఆఫర్లు కూడా కనుమరుగయ్యాయి. మూవీ ఛాన్సులకోసం చాలా రోజులు వెయిట్ చేసింది ఈ భామ. అయితే యేడాది పాటు నిరీక్షించిన మెహ్రిన్ కి కన్నడ లో ఛాన్స్ వచ్చింది. “నీ సిగెవరెగు” అనే కన్నడ సినిమాలో మెహ్రిన్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఆ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటిస్తున్నారు. స్టార్ హీరో సినిమానే అయినా ఈ సినిమా చాలా రోజుల నుండి షూటింగ్ డిలే అవుతూ వస్తుంది. అయినా మెహ్రీన్ అవకాశాల కోసం ఓపిక గా వెయిట్ చేస్తుంది. ఎందుకంటే కన్నడలో ఫస్ట్ సినిమా లోనే స్టార్ హీరోతో కలిసి నటిస్తుందంటే ఆ సినిమా హిట్ అయితే కన్నడలో మెహ్రిన్ వరుస చాన్సులు అందుకునే అవకాశం ఉంది. గతంలో శాన్వి, కృతి కర్బందా లాంటి హీరోయిన్లు కూడా తెలుగులో చేసి ఆ తర్వాత కన్నడలో క్లిక్ అయ్యారు.

- Advertisement -

బ్రాండ్ ఫోటోషూట్స్..

అయితే మెహ్రీన్ సినిమాల ద్వారా దూరంగా ఉన్నా సోషల్ మీడియా లో టచ్ లోనే ఉంటుంది. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు ఫోటోషూట్లతో రచ్చ చేస్తూ ఉంది. తాజాగా వరా అనే బ్రాండ్ మ్యాగజైన్ కి ఫోటోషూట్స్ చేస్తూ తన గ్లామర్ షో చేసింది. మెరూన్ బ్రౌన్ కలర్ మిక్సింగ్ అనార్కలి డ్రెస్ లో హాట్ ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఇంద్ర అనే తమిళ్ సినిమాలో నటిస్తుంది. మరి తెలుగు ఆడియన్స్ ని ఎప్పుడు పలకరిస్తుందో ఈ అమ్మడు. అయితే అప్పుడప్పుడు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ చేస్తూ టాలీవుడ్ కి టచ్ లోనే ఉంటుంది ఈ అమ్మడు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు