NagaChaitanya : ధూత సీక్వెల్ పై క్రేజీ అప్డేట్..

అక్కినేని నాగచైతన్య ప్రధాన పాత్రలో లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ధూత వెబ్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుస పరాజయాలతో ఉన్న చై కి ఈ వెబ్ సిరీస్ ఎంతో ఊరటనిచ్చింది. కొంచెం నెగిటివ్ టచ్ ఉన్న రోల్ అయినప్పటికీ నాగ చైతన్య తన పాత్రలో అద్భుతంగా నటించాడు. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో మిస్టరీ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో వచ్చిన దూత సీజన్ 1 వెబ్ సిరీస్ సూపర్ సక్సెస్ అవడంతో రెండో సీజన్ కూడా రానుందని కొంతకాలంగా టాక్ వినిపిస్తోంది. నాగచైతన్య కూడా ఈ ప్రాజెక్టుపై చాలా ఆసక్తితో ఉన్నారని తెలిసింది. అయితే ఇప్పుడు, ధూత సీజన్ 2 గురించి ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటించేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. దీనికి హింట్ ఇస్తూ నాగ చైతన్య ఓ వీడియోను కూడా పోస్ట్ చేయడం జరిగింది.

క్లూస్ కావాలా?

అయితే రిలీజ్ చేసిన ఆ వీడియో లో నాగచైతన్య న్యూస్ పేపర్ చదువుతున్నట్టుగా ఆ వీడియోలో ఉండగా, ఆ పేపర్‌పై పెద్దగా మార్చి 19 అని రాసి ఉంది. అప్పుడు “కన్‍ఫ్యూజ్ అవుతున్నారా? ఇంకా క్లూస్ కావాలా? మరి మార్చి 19న మీరు రెడీనా?” అని నాగచైతన్య అన్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు చాలా మంది ధూత2 అప్డేట్ గురించే అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ అనౌన్స్ మెంట్ అమెజాన్ ప్రైమ్ నుండి వచ్చింది కాబట్టి, అందులోనూ నాగ చైతన్య పేపర్ చదువుతూ హింట్ ఇచ్చాడు కాబట్టి ధూత2 సిరీస్ అప్డేట్ అనే అనుకోవచ్చు. ఇక ధూత లో తాను ధూత పత్రిక యాజమాన్యం చైర్మెన్ అని తెలిసిందే.

- Advertisement -

ధూత సీజన్ 2 గురించే!

దూత వెబ్ సిరీస్‍లో న్యూస్ పేపర్ ప్రధానంగా ఉంటుంది. కథను ముందుకు నడిపిస్తుంది. ఈ వీడియోలో న్యూస్ పేపర్‌తో నాగ చైతన్య కనిపించడంతో ఇది దూత సీజన్ 2 అనౌన్స్‌మెంట్ గురించే అని తెలిసిపోతుంది. మార్చి 19న ధూత రెండో సీజన్‍ కు సంబంధించి అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారికంగా ప్రకటించడం ఖాయమనిపిస్తోంది. ఇక లాస్ట్ ఇయర్ డిసెంబర్ 1న స్ట్రీమింగ్‍కు వచ్చిన దూత సీజన్ 1 వెబ్ సిరీస్‍కు భారీ వ్యూస్ దక్కాయి. కొన్ని వారాల పాటు గ్లోబల్‍గానూ ట్రెండింగ్‍లో నిలిచింది. తెలుగుతో పాటు హిందీ, మలయాళం, కన్నడ, తమిళం భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ సీజన్ చాలా సక్సెస్ అయింది.

ధూత ఫస్ట్ పార్ట్ లో..

దూత ఫస్ట్ పార్ట్ కథ ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే.. భవిష్యత్తులో జరిగే ఘటనల గురించిన కొన్ని న్యూస్ పేపర్ కటింగ్స్ జర్నలిస్ట్ సాగర్ వర్మ అవధూరి (నాగచైతన్య) కి దొరకడం, అలానే జరగడం చుట్టూ దూత సీజన్ 1 రూపొందింది. ఉత్కంఠభరితంగా దర్శకుడు విక్రమ్ కే కుమార్ ఈ సీజన్‍ను తెరకెక్కించారు. మిస్టరీతో పాటు హారర్ ఎలిమెంట్ కూడా ఉంది. సీజన్ 1 విపరీతంగా ఆకట్టుకోవడంతో దూత సీజన్ 2పై భారీ అంచనాలు ఉన్నాయి. దూత సీజన్ 1 వెబ్ సిరీస్‍లో పశుపతి, పార్వతి తిరువోతు, రవీంద్ర విజయ్, జయప్రకాశ్, రాజా గౌతమ్, తరుణ్ భాస్కర్ కీలకపాత్రలు పోషించారు. ఈ సిరీస్‍కు ఇషాన్ చబ్రా సంగీతం అందించాడు. ఇక దూత వెబ్ సిరీస్ ని విక్రమ్ కుమార్ తన గత కెరీర్ బిగినింగ్ లో తీసిన 13B చిత్రం కథ నేపథ్యాన్ని ఇన్స్పైర్ అయ్యి రాయడం జరిగింది.

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు