Pawan kalyan : PK ఉస్తాద్ గ్లిమ్ప్స్ దాని కోసమే రెడీ చేస్తున్నారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న క్రేజీ ప్రాజెక్టులన్నీ ఆయన పొలిటికల్ బిజీ వల్ల పెండింగ్ లో పడి ఆగిపోయాయన్న విషయం తెలిసిందే. గత మూడు నెలలుగా పవన్ కళ్యాణ్ ఏ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొనడం లేదు. పూర్తి గా రాజకీయాల్లోనే నిమగ్నమయ్యాడు. ఇటు దర్శకులు కూడా పవన్ కళ్యాణ్ గురించి ముందే ఊహించి వీలైనంత త్వరగా సినిమాలని పూర్తి చేద్దామని ట్రై చేసినా అది కుదరలేదు. ఒకేసారి మూడు సినిమాలు సెట్స్ పై ఉండడం వల్ల ఏ ఒక్క సినిమాపై పవన్ కళ్యాణ్ పూర్తిగా డేట్లు కేటాయించడం కుదరలేదు. అయితే పవన్ కళ్యాణ్ ఓజి సినిమా పైనే ముందుగా మొత్తం ఫోకస్ పెడతారని ఆ సినిమానే ముందు వస్తుందని మేకర్స్ అనౌన్స్ చేసారు. అయితే దానికి ఇంకా పాన్ కళ్యాణ్ నాన్ స్టాప్ గా మూడు వారాలు టైం కేటాయిస్తే గాని పూర్తి కాదు. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే అస్సలు కుదరదని చెప్పాలి. ఇక హరీష్ శంకర్ ఆల్రెడీ రవితేజ తో సినిమా చేస్తున్నాడు. అటు క్రిష్ కూడా ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా తీయబోతున్నాడు.

ఉస్తాద్ భగత్ సాంగ్ గ్లిమ్ప్స్ అప్డేట్..

ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ నుండి సడన్ గా ఒక పవర్ ఫుల్ గ్లిమ్ప్స్ ని వదలబోతున్నారంటూ మేకర్స్ అనౌన్స్ చేసారు. మార్చి 19న ఆ గ్లిమ్ప్స్ రిలీజ్ చేస్తారని తెలపగా, ఆల్రెడీ పవన్ హరీష్ ఆ ప్రోమో కోసం డబ్బింగ్ స్టూడియో లో సెట్టింగ్ వేసిన స్టిల్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ సడన్ సప్రైజ్ తో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఓజి ముందు వస్తుందన్న నేపథ్యంలో ఏ అప్డేట్ వచ్చినా ఆ సినిమా నుండే వస్తుందని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ ఉస్తాద్ నుండి అప్డేట్ రావడంతో ఈ సినిమా నుండే ఎందుకు అని ఆరా తీస్తున్నారు. ఇకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ ప్రోమో ఎలా ఉండబోతుంది అన్న విషయంపై ఒక స్ట్రాంగ్ న్యూస్ అయితే వచ్చింది.

- Advertisement -

ఉస్తాద్ భగత్ సింగ్ లో ఆ రిఫరెన్స్..

పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ నుండి రాబోయే గ్లిమ్ప్స్ ప్రోమో ఒక నిమిషానికి పైగా నిడివి ఉంటుందని, పీకే పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఆ టీజర్ ని నింపేస్తున్నారని తెలుస్తుంది. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ నుండి రాబోయే ఆ ప్రోమోలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గుర్తు గ్లాస్ తో కనిపిస్తూ, అలాగే ఇప్పటి రాజకీయాల నేపథ్యంలో కొన్ని పొలిటికల్ పంచ్ లు ఉంటాయని వార్తలు వస్తున్నాయి. అన్నిటికి మించి పవన్ కళ్యాణ్ ఎలక్షన్ టైం లో ఫ్యాన్స్ కి ఊపునిద్దామని ఈ గ్లిమ్ప్స్ ని రెడీ చేస్తున్నారని టాక్. ఏది ఏమైనా ఆగిపోయింది అనుకున్న సినిమా నుండి సడన్ సప్రైజ్ తో ఫ్యాన్స్ థ్రిల్ అవడం ఖాయమని చెప్పొచ్చు. ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ లో మళ్ళీ బిజీ అయ్యేది మే నెల పూర్తయ్యాకే అని చెప్పొచ్చు.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు