#Ustaad Bhagat Singh: ప్రాజెక్ట్ ఆగిపోయింది అనుకునే లోపు, పవన్ కళ్యాణ్‌నే దింపాడు

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి షాక్ సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు హరీష్ శంకర్. అయితే సినిమా టైటిల్ లాగానే ఆ సినిమా రిజల్ట్ కూడా హరీష్ కి షాక్ ఇచ్చింది. ఆ సినిమా తర్వాత మళ్లీ రచయితగా పూరి జగన్నాథ్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేశాడు హరీష్ శంకర్. ఒక దర్శకుడుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మళ్లీ అసిస్టెంట్ గా చేయటం అనేది మామూలు విషయం కాదు. కానీ హరీష్ అలా కాకుండా పూరి గారి దగ్గర మళ్ళీ చేశాడు.

ఇకపోతే ఆ సినిమా తర్వాత మిరపకాయ అనే సినిమాను పవన్ కళ్యాణ్ తో చేయాల్సి ఉంది హరీష్. కానీ ఆ సినిమా కూడా పట్టాలెక్కలేదు అయితే మొదటిసారి అవకాశం ఇచ్చిన రవితేజ మళ్లీ రెండోసారి కూడా అవకాశాన్ని ఇచ్చాడు. అయితే మిరపకాయ సినిమా ఊహించిన రీతిలో అద్భుతమైన హిట్ అయింది. ఇక పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాల్సిన హరీష్ శంకర్ దబాంగ్ అనే రీమేక్ ను గబ్బర్ సింగ్ తెరకెక్కించాడు.

గబ్బర్ సింగ్ సినిమా సృష్టించిన సంచలనం మాటల్లో చెప్పలేనిది. పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ గత పదిహేళ్లుగా తమ హీరోలకు అద్భుతమైన హిట్ లేదు అనుకుంటున్న తరుణంలో, అసలు పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటి అని చూపించి, ఆల్ టైం రికార్డ్ ను సృష్టించిన సినిమా గబ్బర్ సింగ్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని అభిమానులు ఎలా చూడాలనుకుంటారు అలా చూపించి బాక్సాఫీస్ వద్ద బీభత్సమైన సక్సెస్ అందుకున్నాడు. స్వతహాగా హరీష్ శంకర్ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కావడంతో ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు.

- Advertisement -

ఇకపోతే పవన్ కళ్యాణ్ రీఎంట్రీ తర్వాత వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత చేసిన సినిమాలన్నీ దాదాపు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన హిట్ గా నిలిచాయి. ఇకపోతే హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాను చేస్తున్నాడు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించి వచ్చిన అప్డేట్ లన్నిటో కంటే ఈ గ్లిమ్స్ వీడియో అందర్నీ బీభత్సంగా ఆకట్టుకుంది.

ఈ గ్లిమ్స్ వీడియోలోనే పవర్ ఫుల్ గా పవన్ కళ్యాణ్ ని చూపించాడు హరీష్ శంకర్. పవర్ స్టార్ పై టైటిల్ పడినప్పుడే దేవుడు అని ఆడియన్స్ కి కన్వే అయ్యేలా ఆ వీడియోని డిజైన్ చేశాడు హరీష్. అతి తక్కువ టైంలో అద్భుతమైన ఫుటేజ్ రాబట్ట కలగడం హరీష్ కి మాత్రమే సాధ్యమైంది అనే ప్రశంసలు కూడా పొందాడు. అలానే ఈసారి పర్ఫామెన్స్ బద్దలు అయిపోద్ది అని పవన్ కళ్యాణ్ తో చెప్పించడం నెక్స్ట్ లెవెల్ అనిపించింది.

ఇకపోతే ఈ సినిమా తర్వాత స్టార్ట్ అయిన మిగతా సినిమాలన్నీ రిలీజ్ కూడా అయ్యాయి హరిహర వీరమల్లు ఈ సినిమా మాత్రం పెండింగ్ లో ఉండిపోయాయి. ఇకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా దాదాపు ఆగిపోయింది అనే వార్తలు కూడా వినిపించాయి. కానీ ఎవరు ఊహించని విధంగా హరీష్ శంకర్ ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కూడా డబ్బింగ్ . చెబుతున్నారు. వీటికి సంబంధించిన ఫొటోస్ ను హరీష్ శంకర్ ట్విట్టర్ వేదిక రీవీల్ చేశాడు.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు