Dhootha: సక్సెస్ అయితే అయ్యింది కానీ మరి కలెక్షన్స్ మాటేంటి..?

అక్కినేని నాగచైతన్య మొన్నటి వరకు ప్రేక్షకులని తన సినిమాలతో అలరించి.. తాజాగా ‘దూత’ వెబ్ సిరీస్‍తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు.. చైతూ నటించిన తొలి వెబ్ సిరీస్ కూడా ఇదే.. సూపర్ నాచురల్ క్రైమ్ థ్రిల్లర్‌గా దర్శకుడు విక్రమ్ కే కుమార్ ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. మొత్తంగా 8 ఎపిసోడ్లుగా తెరకెక్కిన దూత వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ అమెజాన్ ప్రైమ్ వీడియో లో నవంబర్ 30 న స్ట్రీమింగ్‍కు వచ్చింది. స్ట్రీమింగ్ మొదలైన కొన్ని గంటల్లోనే దూత వెబ్ సిరీస్‍కు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో సూపర్ రెస్పాన్స్ లభించిందీ… ఈ సిరీస్ ఎంతో ఉత్కంఠభరితంగా ఉండటంతో వీక్షకుల సంఖ్య కూడా బాగా పెరుగుతోంది. ఒక్క తెలుగు లోనే కాదు హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లోనూ ఈ దూత సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దూత వెబ్ సిరీస్ ట్రెండింగ్ లిస్టులో టాప్‍కు వచ్చేసింది. దీంతో నాగచైతన్య కూడా సంతోషం వ్యక్తం చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియో లో టాప్-10లో దూత నంబర్.1లో ఉన్నట్టు సమాచారం. . ఈ సిరీస్ లో నాగచైతన్య యాక్టింగ్ అలాగే విక్రమ్ కే కుమార్ టేకింగ్, ఉత్కంఠభరితమైన కథనం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.దూత వెబ్ సిరీస్‍లో నాగ చైతన్యతో పాటు ప్రియా భవానీ శంకర్, పార్వతి తిరువత్తు, ప్రాచీ దేశాయ్, రఘు కుంచె, అనిశ్ కురువిళ్ల మరియు రవీంద్ర విజయ్ కీలకపాత్రలు పోషించారు. విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహించారు. శరత్ మరార్ ఈ సిరీస్ కి మరో నిర్మాతగా ఉన్నారు. ఇకపోతే ఏ ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది కానీ కలెక్షన్ల మాట ఏమిటి అనే విషయానికి వస్తే. దూత’ కోసం ఏకంగా రూ.45 కోట్ల బడ్జెట్ పెట్టారట. అయితే సినిమా విడుదల ఆలస్యం అవ్వడం, అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులకి ఎక్కువ టైం తీసుకోవడం తో పాటూ పబ్లిసిటీ ఖర్చులు కూడా బాగా పెరిగిపోయాయి. దీంతో అన్నీ కలుపుకుని ఇంకో రూ.3 కోట్లు ఎక్స్ట్రా ఖర్చు అయ్యాయట.

ఇక తెలుగులో ఓ వెబ్ సిరీస్ కి దాదాపు రూ.50 కోట్లు పెట్టడం ఇదే మొదటిసారి. మంచి టాక్ అయితే వచ్చింది. మరి నిర్మాతలకి వ్యూయర్ షిప్ రూపంలో అంత మొత్తం తిరిగొస్తుందా అనేది చూడాలి. ఏదేమైనా పెట్టిన బడ్జెట్ తిరిగి వచ్చినప్పుడే ఈ సినిమా సక్సెస్ అని చెప్పవచ్చు.

- Advertisement -

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు