Lifestyle : ముసలితనం హ్యాపీగా గడిచిపోవాలనుకుంటున్నారా? ఈ 7 లైఫ్ లెసన్స్ ముందే నేర్చుకుంటే బెటర్

యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు బాధ్యతలు, సంపాదన అంటూ పరుగులు తీసే ఎంతోమంది రిటైర్మెంట్ సమయానికి సంతోషకరమైన, సంతృప్తికరమైన జీవితాన్ని గడపాలని ఆశిస్తారు. అయితే ప్రస్తుతం మీరు నేర్చుకునే కొన్ని లైఫ్ లెసన్స్ రిటైర్మెంట్ జీవితం హ్యాపీగా ఉండడానికి మార్గాన్ని సుగమం చేస్తాయి. ముఖ్యంగా కొన్ని అలవాట్లను ఇప్పుడు అలవాటు చేసుకుంటేనే భవిష్యత్తులో వాటి ప్రయోజనాన్ని పొందగలుగుతాము. ఇంతకీ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ ను ఎంజాయ్ చేయాలంటే ఇప్పటినుంచే నేర్చుకోవాల్సిన ఆ లైఫ్ లెసన్స్ ఏంటి? అంటే…

1. హెల్ది లైఫ్ స్టైల్

tips-to-have-a-happy-retirement-life
మన శరీరం వృద్ధాప్యం వచ్చేసరికి బలహీనంగా మారుతుంది. ఫలితంగా ఈజీగా అనారోగ్యం బారిన పడతారు. కానీ ఇప్పటినుంచే సరైన ఆహారం తీసుకోవడం, రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను మీ లైఫ్ స్టైల్ లో భాగం చేసుకుంటే రిటైర్మెంట్ సమయంలో హ్యాపీగా, ఆరోగ్యంగా గడిపేయొచ్చు. హెల్దీ లైఫ్ స్టైల్ ని ఫాలో అయితే శరీరానికి తగినంత విటమిన్లు, పోషకాలు అంది, కండరాలు ఎముకలు బలోపేతం అవుతాయి. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల శరీరంతో పాటు మనసు కూడా చురుగ్గా ఉంటుంది. అయితే ఇప్పటి నుంచి వ్యాయామం చేస్తేనే వృద్ధాప్యంలో కూడా హుషారుగా ఉంటారు. అప్పటి సంగతి అప్పుడే చూసుకుందాంలే అనుకుంటే అనారోగ్యంతో హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది.

- Advertisement -

2. ఫైనాన్షియల్ ప్లానింగ్

tips-to-have-a-happy-retirement-life
ఫ్యూచర్ లో మీరు ఎలాంటి లైఫ్ స్టైల్ లో బ్రతకాలి అనుకుంటున్నారు అనేది మీ ఫైనాన్షియల్ ప్లాన్ పై ఆధారపడి ఉంటుంది. దీనికి ధనవంతులే కానక్కర్లేదు. రిటర్మెంట్ టైంలో సౌకర్యవంతంగా ఉండాలనుకునేవారు ఇప్పటినుంచే డబ్బులు కూడ పెట్టుకోవడం మంచిది. కొద్ది కొద్దిగా అయినా సరే వెనకేసుకోవడం వల్ల వృద్ధాప్యంలో మీ అవసరాల గురించి ఇంకొకరిపై ఆధార పడాల్సిన పని ఉండదు. కాబట్టి పొదుపు చేయడం, సరైన విధంగా పెట్టుబడి పెట్టడం వంటివి ఇప్పటినుంచే స్టార్ట్ చేయండి.

3. క్షమించడం

tips-to-have-a-happy-retirement-life
రిటైర్మెంట్ టైంలో సంతోషంగా ఉండాలి అంటే పగ, ప్రతీకారం లాంటి ఎమోషన్స్ ఉండకూడదు. అవి ఉండకూడదు అంటే క్షమించే గుణాన్ని అలవాటు చేసుకోవాలి. క్షమించకపోవడం వల్ల మనకు మనశ్శాంతి కరువవుతుంది. ఫలితంగా ఏళ్ల తరబడి ఆ అసంతృప్తితో బ్రతకాల్సి వస్తుంది. అవతలి వ్యక్తి అన్నీ మర్చిపోయి బాగానే ఉంటారు. దాని బదులు క్షమించేస్తే ఆ బాధ ఎక్కువ కాలం వెంటాడదు.

4. సోషల్ కనెక్షన్స్

tips-to-have-a-happy-retirement-life
వాస్తవానికి ఏజ్ పెరిగే కొద్దీ స్నేహితులు తగ్గుతూ వస్తారు. అయితే రిటైర్మెంట్ సమయంలో సంతోషంగా ఉండాలంటే కొన్ని రిలేషన్స్ ను మెయింటైన్ చేయాల్సిందే. మీకు స్ఫూర్తినిచ్చే వ్యక్తులు, డెవలప్మెంట్ వైపు నడిపించే వారిని, మీ పట్ల శ్రద్ధ వహించే వారిని అస్సలు వదులుకోకండి. ఫ్రెండ్స్ లేకపోతే వాళ్ళను వెతుక్కునే పనిలో పడండి. వృద్ధాప్యంలో ఈ ముఖ్యమైన వ్యక్తులే మీకు తోడుగా ఉంటారు.

5. తిరిగి ఇచ్చేయండి
సమాజానికి తిరిగి ఇవ్వడం నేర్చుకోండి. మీకు వీలైనంతవరకు సహాయం చేయడానికి ట్రై చేయండి. ఆశ్రమాల దగ్గర సేవ చేయడం వంటి స్వచ్ఛంద సేవలో పాల్గొనండి. విరాళాలు ఇవ్వడం, చేతనైనంత మేరకు ఇతరుల అవసరాలను తీర్చడానికి ట్రై చేయండి. సేవ గుణం అనేది సంతృప్తికర జీవితాన్ని గడిపేలా చేస్తుంది.

6. ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్
హ్యాపీ లైఫ్ కి సీక్రెట్ ఏమిటంటే గ్రాటిట్యూడ్. చిన్న చిన్న విషయాలకు కూడా అభినందించడం అనేది మనం ఎంత అదృష్టవంతులమో తెలుసుకోవడంలో సహాయపడుతుంది. అలాగే ఇతరులు ఎంత బాగా పని చేస్తున్నారు అని గుర్తించడం వల్ల వారి సక్సెస్ ను చూసి అసూయ పడే పరిస్థితి రాదు. కాబట్టి గ్రాటిట్యూడ్ అనేది మీ జీవితంలో అలవర్చుకోవాల్సిన ముఖ్యమైన లైఫ్ లెసన్.

7. పాజిటివ్ మైండ్ సెట్
మనం చూసే విధానాన్ని బట్టి ప్రపంచం కనిపిస్తుంది. పచ్చ కామెర్లు ఉన్నవాడికి ప్రపంచం అంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్టుగా మనం పాజిటివ్ మైండ్ సెట్ తో చూస్తే ప్రపంచం అంతా పాజిటివ్ గానే కనిపిస్తుంది. నేర్చుకోవడం, ప్రపంచాన్ని ఆశావాదం, పాజిటివిటీతో చూడడం అనేవి సంతోషానికి కీలకమైన అంశాలు. అలాగే ఒత్తిడి తగ్గి ఆరోగ్యంగా ఉండగలుగుతారు. కాబట్టి హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ ను జీవించాలంటే పాజిటివిటీ ముఖ్యమని గుర్తు పెట్టుకోండి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు