Personality Development : ఈ డైలీ హ్యాబిట్స్ ఉంటే లైఫ్ లో సగం సక్సెస్ అయినట్టే

జీవితంలో సక్సెస్ కావడానికి సవాలక్ష ప్రయత్నాలను చేస్తూ ఉంటారు జనాలు. నిజానికి సక్సెస్ అనేది ఎవరికీ అంత ఈజీగా దక్కదు. ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అయితే అంతకంటే ముందు మన అలవాట్లు, ఆలోచనలపై సక్సెస్ రేట్ అనేది ఆధారపడి ఉంటుంది. కొన్ని డైలీ హ్యాబిట్స్ ఫాలో అయితే లైఫ్ లో సగం సక్సెస్ అయినట్టే. మరి ఆ డైలీ హ్యాబిట్స్ ఏంటి? అనే ఇంట్రెస్టింగ్ విషయాన్నీ ఈరోజు తెలుసుకుందాం.

1. త్వరగా లేవడం
చాలామంది సక్సెస్ ఫుల్ పీపుల్ సూర్యోదయానికి ముందే నిద్రలేస్తారు. త్వరగా నిద్ర లేవడం వల్ల ప్రశాంతంగా డేను ప్లాన్ చేసుకోవడానికి కావాల్సినంత సమయం దొరుకుతుంది. అంతేకాకుండా ఏకాగ్రతను, ఆరోగ్యాన్ని పెంచే వ్యాయామం, ధ్యానం లాంటివి చేయడానికి టైం దొరుకుతుంది. అయితే ఒకేసారి ఉదయాన్నే ఐదు గంటలకు లేవమని కాదు. నెమ్మదిగా ట్రై చేయండి. సాధారణంగా మీరు నిద్ర లేవడం కంటే ఒక 15 నిమిషాల ముందు మేల్కోనడానికి ట్రై చేయండి. నెమ్మదిగా ఆ సమయాన్ని పెంచుతూ సూర్యోదయానికి ముందే నిద్రలేవడానికి ట్రై చేయండి.

2. సెట్ డైలీ గోల్స్
ఎప్పుడైనా డే మొత్తం గందరగోళంగా అనిపించిందా? ఆరోజు చేయాల్సిన పనులను సగం కూడా పూర్తి చేయలేదని ఫీల్ అయ్యారా? కానీ సక్సెస్ ఫుల్ పీపుల్ ఎప్పుడూ ఇలాంటి గందరగోళానికి గురికారు. ఎందుకంటే వాళ్ళు డైలీ గోల్స్ ను సెట్ చేసుకుంటారు. ప్రతిరోజు స్పష్టమైన గోల్స్ ను సెట్ చేసుకోవడం వల్ల అదొక రోడ్ మ్యాప్ లాగా పని చేస్తుంది. ఏ టైంలో ఏం చేయాలి? ఎప్పటికీ పూర్తి చేయాలి అనే క్లారిటీ ఉంటుంది. దాన్ని ఫాలో అవుతూ పనులు చేసుకుంటే ప్రశాంతంగా ఉండటమే కాకుండా ప్రోడక్టివిటీ కూడా పెరుగుతుంది.

- Advertisement -

3. చదవడం
లైఫ్ లో ఇప్పటికే సక్సెస్ ను రుచి చూసిన వాళ్ళు నేర్చుకునే ముఖ్యమైన లైఫ్ లెసన్ నేర్చుకోవడం. ఎందుకంటే లర్నింగ్ అనేది జీవితంలో కొత్త విషయాలను నేర్చుకోవడానికి, మరింతగా ఎదగడానికి ఉపయోగపడుతుందని వాళ్లకు తెలుసు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఒకరైన బిల్ గేట్స్ ప్రతివారం ఒక కొత్త పుస్తకాన్ని చదువుతారట. అలా బుక్స్ చదవడం ద్వారా ఇతరుల అనుభవాల నుండి నేర్చుకునే విషయాలే విజయానికి కీలకమైన మెట్టు అని ఆయన నమ్ముతారు.

4. హెల్దీ లైఫ్ స్టైల్
విజయం సాధించాలనే తపనతో ఎంతోమంది తమ ఆరోగ్యాన్ని పణంగా పెడతారు. హెల్త్ గురించి ఎంత నిర్లక్ష్యంగా ఉంటారంటే, తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యేదాకా కనీసం గమనించరు. ముందుగా త్వరగా భోజనం చేయాలి అనే ఉద్దేశంతో జంక్ ఫుడ్ ను అలవాటు చేసుకుంటారు. దీంతో శక్తి తగ్గిపోయి ప్రోడక్టివిటీ దెబ్బతింటుంది. ఆ తర్వాత పనిలో క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. అప్పుడు అర్థమవుతుంది ఇదంతా లైఫ్ స్టైల్ లో వచ్చిన మార్పుల వల్ల అని. కాబట్టి శారీరకంగా, మానసికంగా మిమ్మల్ని చురుగ్గా ఉంచే హెల్దీ లైఫ్ స్టైల్ పై కాన్సన్ట్రేట్ చేయండి. హెల్దీ ఫుడ్ తినడంతో పాటు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, తగినంత నిద్రపోవడం కూడా ముఖ్యమే.

5. ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్
విజయం కోసం పెట్టే పరుగులో చాలా ముఖ్యమైన అంశాలను, వ్యక్తులను కోల్పోతుంటారు. కాబట్టి ఏ రోజుకారోజు గ్రాటిట్యూడ్ ను పాటించడం అలవాటు చేసుకోండి. గ్రాటిట్యూడ్ అనగానే కేవలం థాంక్స్ చెప్పడం కాదు. ఇది జీవితంలోని మంచిని గుర్తించడం, అభినందించడం, కఠినమైన సమయం ఎదురైనప్పుడు పాజిటివ్ గా ఉండడం. గ్రాటిట్యూడ్ తో డేను స్టార్ట్ చేస్తే రోజంతా పాజిటివ్ గా, హ్యాపీగా ఒత్తిడి లేకుండా పని చేసుకోగలుగుతారు.

6. నెట్వర్కింగ్ ఇంపార్టెంట్
ఇక ఇప్పటికే విజయవంతమైన వ్యక్తుల్లో గమనించదగ్గ ముఖ్యమైన అలవాటు ఏమిటంటే నెట్వర్కింగ్. వాళ్లు స్ట్రాంగ్ రిలేషన్స్ ను మైంటైన్ చేస్తూ ఉంటారు. అలాగే కొత్త పరిచయాలను పెంచుకోవడానికి జంకరు. కాబట్టి కో ఎంప్లాయిస్ తో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూనే కొత్త వ్యక్తులను కలవడానికి రెడీగా ఉండండి.

7. రెస్ట్ తీసుకోండి
సాధారణంగా వేస్ట్ తీసుకోవడం అనేది సోమరితనంగా అనిపిస్తుంది. కానీ మనమేం పని చేసే యంత్రాలం కాదు కదా ? కాబట్టి ఎంత బిజీగా ఉన్నా కూడా అప్పుడప్పుడు కాస్త రెస్ట్ తీసుకోండి.

8. మల్టీ టాస్కింగ్ మానుకోండి
మల్టీ టాస్కింగ్ అనేది ప్రోడక్టివిటీని చంపేస్తుంది. కాబట్టి ముఖ్యమైన పనిని చేస్తున్నప్పుడు దానిపై మాత్రమే ఫోకస్ పెట్టండి.

9. ఫెయిల్యూర్ ను అంగీకరించండి
ఫెయిల్యూర్ అనేది నిరుత్సాహ పరుస్తుంది. ఇబ్బందికరంగా అనిపించడమే కాకుండా మీ విలువను ప్రశ్నించేలా చేస్తుంది. ఇది నెగిటివ్ సైడ్ మాత్రమే. ఫెయిల్యూర్ కు పాజిటివ్ సైడ్ చూస్తే… నిజానికి ఫెయిల్యూర్ అనేది ఒక లైఫ్ లెసన్. ఎదగడానికి, మిమ్మల్ని మీరు మరింతగా డెవలప్ చేసుకోవడానికి ఒక కొత్త అవకాశం. కాబట్టి ఎదురుదెబ్బ తగిలితే అక్కడే ఆగిపోకుండా సరైన దారిలో మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టండి. ఈ డైలీ హ్యాబిట్స్ ఉంటే లైఫ్ లో సగం సక్సెస్ అయినట్టే.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు