Chiranjeevi Srikanth: ఆన్ స్క్రీన్ లోనే కాదు.. ఆఫ్ స్క్రీన్ లో కూడా!

టాలీవుడ్ లో స్వయంకృషితో ఎదిగి నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీ ని శాసిస్తున్న మెగా స్టార్ చిరంజీవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎవరిఅండ లేకుండా వచ్చిన చిరు తాను వేసిన రోడ్డు నుండే పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్లు ఎదగడానికి కారణమయ్యాయి. అయితే ఫ్యామిలీ నుండే కాదు, చిరు అండతో ఇండస్ట్రీ లో ఎదిగిన కొంతమంది స్టార్లు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళలో శ్రీకాంత్, శ్రీహరి, జగపతిబాబు, రవితేజ లాంటివాళ్లు కూడా ఉన్నారు. వీళ్ళు ఇండస్ట్రీ కి సొంతంగానే ఎంట్రీ ఇచ్చినా, కెరీర్ బిగినింగ్ లో చిరు ప్రోత్సాహం ఎంతో లభించింది. ఇక అందులో శ్రీకాంత్ తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ తెచ్చుకుని స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి కొనసాగుతూ దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా కోట బొమ్మాళితో మంచి హిట్టు కొట్టిన ఈ హీరో వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

అన్నదమ్ముల అనుబంధం..

ఇక కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చిన శ్రీకాంత్ వన్ బై టు అనే సినిమాతో హీరోగా పరిచయమైనా, తాజ్ మహల్ సినిమా హీరోగా మంచి బ్రేక్ వచ్చింది. ఇక ఆ సినిమా నుండి పెళ్లి సందడి సినిమాతో మంచి క్రేజ్ ని సంపాదించాడు. స్వతహాగా చిరు అభిమానిగా చిరుని ఇన్స్పైర్ అయ్యే సినిమాల్లోకి వచ్చిన శ్రీకాంత్ చిరంజీవి ప్రోత్సాహం కూడా దక్కించుకున్నాడు. ఇక ఆ రోజుల్లో శ్రీకాంత్ నటించిన చాలా సినిమాలకు చిరంజీవి చేత ప్రారంభోత్సవం లేదా 100 రోజుల ఫంక్షన్ జరిగేది. ఇక వీళ్ళిద్దరూ సినిమాల్లో నటించాలని 90స్ లోనే ప్రయత్నాలు జరిగినా ఫైనల్ గా కార్యరూపం దాల్చింది మాత్రం 2004 లో. చిరు శంకర్ దాదా సినిమాలో ATM పాత్రకోసం చిరంజీవి స్పెషల్ గా ఫోన్ చేసి ఈ సినిమా లో పాత్ర చేస్తావా అని స్వయంగా అడిగారు. సెకండ్ లీడ్ రోల్ అయిన ఆ పాత్రతో శ్రీకాంత్ ప్రత్యేక ఇమేజ్ కూడా తెచ్చుకున్నాడు. ఇక అప్పట్లో సినిమా ఏ రేంజ్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత తిరిగి ఇదే కాంబోలో శంకర్ దాదా జిందాబాద్ కూడా వచ్చింది.

- Advertisement -

ఇక శ్రీకాంత్ కెరీర్ బిగినింగ్ నుండి ఇప్పుడు కూడా చిరుని తన సొంత అన్నయ్యలా భావించి ఎప్పటికప్పుడు మెగా ఫ్యామిలి ఈవెంట్స్ కి వస్తూ ఉంటాడు. ఇటు చిరు కూడా పవన్ తర్వాత తన తోడబుట్టినాలాంటి వాడు శ్రీకాంత్ నా తమ్ముడు అని చాలా సందర్భాల్లో అంటుంటాడు. ఆ మధ్య చిరంజీవి రీ ఎంట్రీ అప్పుడు శ్రీకాంత్ ప్రత్యేకంగా చిరు తోనే చాలా సన్నిహితంగా ఉండడం గమనించే ఉంటారు. ఇక చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం సైరా రిలీజ్ అయ్యాక సక్సెస్ సంబరాల్లో సినిమా నుండి తనకు ఏమాత్రం సంబంధం లేకపోయినా, తన సినిమాలా ఆ సినిమా సెలబ్రేషన్ చేయడం తన అభిమానానికి నిదర్శనం. ఇక తన కొడుకు రోషన్ ని కూడా ఇండస్ట్రీకి లాంచ్ చేయడంలో కూడా చిరు సహకారం ఎంతో ఉంది. ఇక తాజాగా శ్రీకాంత్ పుట్టిన రోజు సందర్బంగా చిరంజీవి స్వయంగా శ్రీకాంత్ ఇంటికి వెళ్లి కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేయడం తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. వీళ్ళు ప్రైవేట్ గా ఎన్నో సార్లు పార్టీలు సెలెబ్రేట్ చేసుకుంటారు. కానీ ఇలా అప్పుడప్పుడూ ఇలా సోషల్ మీడియా లో ఇలా అరుదుగా కనిపంచేసరికి ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు