Om Bheem Bush : అంచనాలను మించిపోయింది..

టాలీవుడ్ లో ఈ వారం క్రేజీ అంచనాలతో రిలీజ్ అయిన ఏకైక సినిమా ఓం భీం బుష్. ఈ సినిమాలో శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి మెయిన్ లీడ్ గా నటించారన్న సంగతి తెలిసిందే. ఇక పక్కా కామెడి ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 22న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి ప్రేక్షకుల దగ్గర మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఇక టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర శ్రీ విష్ణు లాస్ట్ ఇయర్ సామజవరగమన అనే ఎంటెర్టైన్మెంట్ సినిమాతో మంచి హిట్టు కొట్టగా, ఈ ఇయర్ కూడా కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్ సినిమా తో వచ్చాడు. ఇక రీసెంట్ గా మంచి ప్రమోషన్స్ నే జరుపుకుని రిలీజ్ అయిన సినిమా సమ్మర్ లో రిలీజ్ అయి మంచి బోణి కొట్టింది. అన్ని సెంటర్ల ప్రేక్షకుల నుండి కూడా ఆల్మోస్ట్ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

సాలిడ్ రెస్పాన్స్ తో రెండో రోజు కుమ్మింది..

ఓం భీం బుష్ రిలీజ్ అయిన ఫస్ట్ డే IPL మ్యాచ్ ల ఎఫెక్ట్ వల్ల కాస్త తడబడినా డీసెంట్ ఓపెనింగ్స్ తెచ్చుకోగా, రెండో రోజు మాత్రం కుమ్మేసిందని చెప్పాలి. ఉన్నంతలో మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ నే సినిమా సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా నైజాంలో సినిమా కి మంచి ఓపెనింగ్స్ సొంతం అవ్వగా ఆంధ్ర సీడెడ్ లో యావరేజ్ ఓపెనింగ్స్ దక్కాయి. తొలిరోజు వరల్డ్ వైడ్ గ్రాస్ 3.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోగా, రెండో రోజు అన్ని అంచనాలను మించిపోయింది ఈ సినిమా. బాక్స్ ఆఫీస్ దగ్గర శ్రీ విష్ణు కి ఆల్మోస్ట్ రెండో వరుస విజయం దక్కడం ఖాయమని తెలుస్తుంది. ఇక రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ గా ట్రెండ్ ను చూపించడం విశేషం. రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ కలెక్షన్స్ ని చూస్తే ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం 1.2 కోట్ల రేంజ్ నుండి ఆ పైన వెళుతుంది అనుకోగా, సినిమా క్రికెట్ మ్యాచ్ ల ఇంపాక్ట్ ఉన్నా కూడా అంచనాలను మించి పోయి ఏకంగా 1.65 కోట్ల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 2 కోట్ల మార్క్ ని దాటేసి ఏకంగా 2.15 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకుని దుమ్ములేపింది.

- Advertisement -

ఇక వరల్డ్ వైడ్ గా 3.95 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని సాలిడ్ గా ట్రెండ్ అయ్యింది. ఇక మొత్తం మీద 2 రోజుల్లో సినిమా సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే, నైజాంలో 1.45 కోట్లు, ఆంధ్రప్రదేశ్ లో లో 1.35 కోట్లు రాబట్టగా, కర్ణాటక, రెస్ట్ అఫ్ ఇండియా, ఓవర్సీస్ లో కలిపి 1.25 కోట్లు వసూలు చేసింది. ఇక రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 4.05 కోట్ల షేర్ వసూలు చేయగా, 7.65 కోట్లు రాబట్టింది. మొత్తం మీద సినిమా 10 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 5.95 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక ఆదివారం ఇంకా సోమవారం హోలీ హాలిడే తో సాలిడ్ గ్రోత్ చూపించే అవకాశం ఉంది.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు