OmBheemBush : డే1 కుమ్మింది గాని.. అక్కడే దెబ్బ పడింది..

టాలీవుడ్ లో ఈ వారం క్రేజీ అంచనాలతో రిలీజ్ అయిన ఏకైక సినిమా ఓం భీం బుష్. ఈ సినిమాలో శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి మెయిన్ లీడ్ గా నటించారన్న సంగతి తెలిసిందే. ఇక పక్కా కామెడి ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 22న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి ప్రేక్షకుల దగ్గర మిశ్రమ స్పందన తెచ్చుకుంది. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర శ్రీ విష్ణు లాస్ట్ ఇయర్ సామజవరగమన అనే ఎంటెర్టైన్మెంట్ సినిమాతో మంచి హిట్టు కొట్టగా, ఈ ఇయర్ కూడా కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్ సినిమా తో వచ్చాడు. ఇక రీసెంట్ గా మంచి ప్రమోషన్స్ నే జరుపుకుని రిలీజ్ అయిన సినిమా సమ్మర్ రేసులో రిలీజ్ అయినా కూడా రెస్పాన్స్ తెచ్చుకుంది.

ఆడియన్స్ నుండి సాలిడ్ రెస్పాన్స్..

ఇక నిన్నటి నుండి IPL కూడా స్టార్ట్ అవ్వడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర కొంచం ఇంపాక్ట్ పడింది. కానీ ఉన్నంతలో మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ నే సినిమా సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా నైజాంలో సినిమా కి మంచి ఓపెనింగ్స్ సొంతం అవ్వగా ఆంధ్ర సీడెడ్ లో యావరేజ్ ఓపెనింగ్స్ దక్కాయి. అమెరికాలో సినిమా ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో ఓం భీం బుష్ మంచి ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోగా తొలిరోజు వరల్డ్ వైడ్ గ్రాస్ 3.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా ట్రాక్ చేసిన సెంటర్స్ తో కలిపి ఓవరాల్ గా 2.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకుంది.

- Advertisement -

ఒకసారి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్లను గమనిస్తే.. నైజాంలో 0.60 కోట్లు, ఆంధ్ర ప్రదేశ్ 0.50 కోట్లు, టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో 1.15 కోట్లు, కర్ణాటక, రెస్ట్ అఫ్ ఇండియా ఓవర్సీస్ తో కలిపి -0.75 కోట్లు వసూలు చేయగా వరల్డ్ వైడ్ గా 1.90కోట్ల షేర్ 3.70కోట్ల గ్రాస్ రాబట్టింది. అయితే సినిమా ఓవరాల్ గా సినిమా 10 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా చాలా దూరం వెళ్ళాల్సిన అవసరం ఉంది. దాదాపు మరో 8 కోట్లకి పైగా రాబట్టాలి. ఓవరాల్ గా డీసెంట్ స్టార్ట్ ను సొంతం చేసుకున్నా ఇంకా బెటర్ గా ఓపెనింగ్స్ ను అందరూ ఎక్స్ పెర్ట్ చేశారు. టాక్ ఎలాగూ బాగానే ఉండటంతో వీకెండ్ లో మంచి గ్రోత్ చూపించే అవకాశం ఉందని చెప్పొచ్చు.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు