Vikram K Kumar: నితిన్ కి మరో కంబ్యాక్

తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి జయం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నితిన్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. ఈ సినిమా తర్వాత చేసిన దిల్ సినిమా కూడా మంచి సక్సెస్ ను అందుకుంది. వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతోనే దిల్ రాజు నిర్మాతగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీస్ పరిచయం అయ్యారు. ఇకపోతే ఈ సినిమా తర్వాత చేసిన కొన్ని సినిమాలు నితిన్ ను నిరాశపరిచాయి. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై సినిమా అద్భుతమైన ఘనవిజయం సాధించింది.

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై సినిమా తర్వాత నితిన్ కి దాదాపు పది ఏళ్ల వరకు హిట్ సినిమా లేకుండా పోయింది. నితిన్ నుంచి చాలా సినిమాలు వచ్చినా కూడా, ఇతనికి చాలా అవకాశాలు వచ్చినా కూడా సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇకపోతే నితిన్ కెరియర్ కి మంచి కంబ్యాక్ ఫిల్మ్ అంటే ఇష్క్ అని చెప్పొచ్చు. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది.

ఈ సినిమాకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఇదే ఆడియో ఫంక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే నితిన్ కి ఎంత ఇష్టమని చాలామందికి తెలిసి వచ్చింది. పవన్ కళ్యాణ్ కి నితిన్ ఎంత పెద్ద ఫ్యానో ఆ రోజే చెప్పుకొచ్చాడు. ఆ సినిమా తర్వాత నితిన్ది ఏ సినిమా వచ్చినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఆదరించారు అని చెప్పొచ్చు. చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు లానే నితిన్ కూడా పవన్ కళ్యాణ్ ఇష్టపడుతుంటాడు.

- Advertisement -

ఇకపోతే ఇష్క్ సినిమా తర్వాత వచ్చిన గుండెజారి గల్లంతయింది సినిమా కూడా విజయాన్ని సాధించింది. ఆ తర్వాత నితిన్ చేసిన చాలా సినిమాలలో పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ కూడా వాడాడు అని చెప్పొచ్చు. ఇకపోతే దర్శకుడు విక్రమ్ కె కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమా సినిమాకి జోనర్ ని మార్చే అతి తక్కువ మంది దర్శకులలో విక్రమ్ కే కుమార్ ఒకరు. తమిళ్ లో విక్రమ్ కే కుమార్ చేసిన ఎన్నో హిట్ సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యాయి.

అయితే విక్రం కే కుమార్ తెలుగులో చేసిన సినిమాలు కూడా అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించాయి. విక్రమ్ కుమార్ ప్రతిసారి ఆడియన్స్ ను తన సినిమాలతో మెస్మరైజ్ చేస్తారని చెప్పొచ్చు. తెలుగులో అక్కినేని ఫ్యామిలీ కూడా మనం వంటి బ్లాక్ బస్టర్ హిట్ ను ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ నితిన్ తో మరోసారి విక్రం కే కుమార్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో నితిన్ చేసిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా వచ్చిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమా కూడా ఊహించిన విజయాన్ని సాధించలేదు. ఇకపోతే 90స్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ కూడా నితిన్ ప్రస్తుతం సినిమాని చేస్తున్నాడు. ఇకపోతే ఇప్పుడు విక్రం కే కుమార్ చేయబోయే సినిమా ఇతనికి మళ్ళీ కంబ్యాక్ ఇస్తుందా లేదా అని తెలియాలంటే కొంతకాలం వెయిట్ చూడక తప్పదు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు