Manjummel Boys : తమిళ గడ్డపై టాప్ లేపిన మలయాళం సినిమా.. ఏకంగా తమిళ్ సినిమానే..

టాలీవుడ్ లో గత రెండు నెలలుగా సరైన బ్లాక్ బస్టర్ సినిమాల సక్సెస్ లు లేక సతమతమవుతుంటే మలయాళం ఇండస్ట్రీ లో మాత్రం వరుస బెట్టి బ్లాక్ బస్టర్లు వారానికొకటి నమోదయ్యాయి. రెండు నెలల కాలంలో నాలుగు వంద కోట్ల సినిమాలతో జోరు చూపించింది మలయాళం ఇండస్ట్రీ. ఇక ఆ సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి ఆదరణ దక్కించుకున్నాయి. ఇక అలాగే నెలన్నర క్రితం మలయాళంలో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్స్ సినిమాల్లో మంజుమ్మేల్ బాయ్స్ కూడా ఒకటి. రీసెంట్ గా ఈ సినిమా మలయాళం లో అన్ని సినిమాల రికార్డులని ఫైనల్ గా బ్రేక్ చేసిందని ఫైనల్ గా ఇండస్ట్రీ హిట్ అయిందని తెలిసిందే. అయితే ఈ రికార్డులు కేరళ కలెక్షన్ల కంటే ఓవర్సీస్, తమిళనాడు కలెక్షన్స్ తోనే ఎక్కువ సాద్యమైందని చెప్పాలి.

ముఖ్యంగా తమిళనాడు లో ఈ సినిమా దుమ్ములేపింది. ఎంతలా అంటే అక్కడి సినిమాలను కూడా ప్రేక్షకులు లెక్కచేయనంత.. ఇక అసలు విషయానికి వస్తే .. ఒక భాష సినిమా మరో భాషలో డబ్ అయ్యి బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ ని సాధించడం మనం చూశాం. కానీ ఒరిజినల్ వర్షన్ తోనే మరో ఇండస్ట్రీలో హైయెస్ట్ కలెక్షన్స్ ని బ్రేక్ చేయడం మాత్రం చాలా చాలా అరుదు అని చెప్పాలి. అప్పట్లో తెలుగు సినిమా బాహుబలి 2 కర్ణాటక లో కన్నడ సినిమాలని మించి వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇక ఇప్పుడు ఇదే సీన్ రిపీట్ చేసింది మలయాళ సినిమా మంజుమ్మేల్ బాయ్స్. మలయాళ ఇండస్ట్రీ నుండి వచ్చిన లేటెస్ట్ ఇండస్ట్రీ హిట్ మూవీ మంజుమ్మేల్ బాయ్స్ సినిమా అన్ సీజన్ అయిన ఫిబ్రవరి లో రిలీజ్ అయి కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా, తమిళనాడులో అయితే ఏ మలయాళ సినిమా హిస్టరీలో సాధించని రేంజ్ లో కొత్త రికార్డులను నమోదు చేసి 50 కోట్ల మమ్మోత్ గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది.

ఇక ఇప్పుడు లేటెస్ట్ గా మరో రికార్డ్ ను కూడా, నమోదు చేసి సంచలనం సృష్టించింది. ఈ ఇయర్(2024) లో తమిళనాడులో రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో ఇప్పటి వరకు హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా శివ కార్తికేయన్ హీరోగా నటించిన అయలాన్ మూవీ. తమిళనాడులో ఆల్మోస్ట్ 57.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని అందుకుని టాప్ లో ఉండగా, ఇప్పుడు ఆల్మోస్ట్ 57.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ తో మంజుమ్మేల్ బాయ్స్ సినిమా ఎపిక్ రన్ తో అయలాన్ మూవీ ని క్రాస్ చేసి తమిళనాడులో ప్రస్తుతానికి ఈ ఇయర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాగా నిలిచింది. ఒక మలయాళ స్ట్రైట్ మూవీ ఇలా పక్క రాష్ట్రంలో డబ్ అవ్వకుండానే ఒరిజినల్ వర్షన్ తో ఏకంగా ఆ ఇయర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా వసూళ్ళని బ్రేక్ చేయడం అంటే మామూలు రికార్డ్ కాదనే చెప్పాలి. ఇక తెలుగు లో ఈ సినిమా త్వరలో డబ్ కానుంది.

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు