Manjummel Boys : ఇండస్ట్రీ హిట్టు బొమ్మ.. కానీ అక్కడ కాదు?

టాలీవుడ్ లో గత రెండు నెలలుగా సరైన బ్లాక్ బస్టర్ సక్సెస్ లు లేక సతమతమవుతుంటే మలయాళం ఇండస్ట్రీ లో మాత్రం వరుస బెట్టి బ్లాక్ బస్టర్లు వారానికొకటి నమోదయ్యాయి. రెండు నెలల కాలంలో నాలుగు వంద కోట్ల సినిమాలతో జోరు చూపించింది మలయాళం ఇండస్ట్రీ. ఇక ఆ సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి ఆదరణ దక్కించుకున్నాయి. రీసెంట్ గా మలయాళం ప్రేమలు తెలుగులో కూడా రిలీజ్ అయ్యి ఇక్కడ బయ్యర్లకి మూడు రెట్ల లాభాన్ని సైతం అందించి లాంగ్ రన్ లో ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతుంది. ఇక అలాగే నెలన్నర క్రితం మలయాళంలో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్స్ లో మంజుమ్మేల్ బాయ్స్ కూడా ఒకటి. రీసెంట్ గా ఈ సినిమా మలయాళం లో అన్ని సినిమాల రికార్డులని ఫైనల్ గా బ్రేక్ చేసిందని ఫైనల్ గా ఇండస్ట్రీ హిట్ అయిందని తెలిసిందే. కానీ నిజానికి ఇంకా ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కి కొంత దూరంలో ఉందని చెప్పాలి.

అయితే మామూలుగా ఇండస్ట్రీ హిట్ మూవీ అంటే అన్ని చోట్లా ప్రీవియస్ ఇండస్ట్రీ హిట్ రికార్డులను నమోదు చేసిన సినిమా కలెక్షన్స్ ని బ్రేక్ చేసి కొత్త రికార్డులను నమోదు చేస్తే ఆ సినిమా నిఖార్సయిన ఇండస్ట్రీ హిట్ గా చెప్పొచ్చు. కానీ అన్ని సినిమాలకు ఇది సాధ్యం కాదు కూడా. తెలుగులో RRR ఇండస్ట్రీ హిట్ అయినా, ఇతర భాషల్లో బాహుబలి2 ని బ్రేక్ చేయలేదు. కొన్ని సినిమాలు కొన్ని చోట్ల అంచనాలను మించి వసూళ్ళని సాధించి ఓవరాల్ కలెక్షన్స్ తో పాత ఇండస్ట్రీ హిట్ మూవీని బీట్ చేసి కొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తాయి. రీసెంట్ గా మలయాళ ఇండస్ట్రీ నుండి వచ్చిన మంజుమ్మేల్ బాయ్స్ సినిమా విషయంలో ఇదే జరిగింది.

ఇక్కడ ఇండస్ట్రీ హిట్ కాదు..

- Advertisement -

లాస్ట్ ఇయర్ రిలీజ్ అయి పాత ఇండస్ట్రీ హిట్ మూవీ గా నిలిచిన 2018 మూవీ సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 178 కోట్లను భారీ మార్జిన్ తో బ్రేక్ చేసిన మంజుమ్మేల్ బాయ్స్ సినిమా ఇప్పటి వరకు 204 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా అందుకుని భారీ లీడ్ తో కొత్త ఇండస్ట్రీ హిట్ మూవీగా నిలిచింది. కానీ అదే టైంలో సొంత గడ్డ అయిన కేరళలో మాత్రం ఈ సినిమా ఇంకా 2018 మూవీ రికార్డులని బ్రేక్ చేయలేకపోయింది. కేరళలో పాత ఇండస్ట్రీ హిట్ అయిన 2018 కన్నా చాలా వెనకబడే ఉంది. 2018 మూవీ టోటల్ రన్ లో 89.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంటే మంజుమ్మేల్ బాయ్స్ ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 63.20 కోట్ల రేంజ్ లోనే గ్రాస్ ను అందుకుంది. తమిళ్ లో ఓవర్సీస్ లో ఎక్కువ వసూళ్లు రావడంతో ఓవరాల్ గా ఇండస్ట్రీ హిట్ గా ఈ సినిమా నిలిచినప్పటికీ కూడా ఇంకా కేరళలో ఇండస్ట్రీ హిట్ అవ్వాలి అంటే మాత్రం మంజుమ్మేల్ బాయ్స్ మరో 26 కోట్ల గ్రాస్ వసూళ్ళని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ప్రస్తుతం థియేట్రికల్ రన్ స్లో కావడంతో ఇక ఈ మార్క్ ని ఇక్కడ అందుకోవడం కష్టమే అని ట్రేడ్ పండితులు అంటున్నారు దాంతో ఓవరాల్ ఇండస్ట్రీ హిట్ అయినా కూడా కేరళలో మాత్రం 2018 ఇండస్ట్రీ హిట్ గా కొనసాగే అవకాశమే చాలా ఎక్కువ అని చెప్పాలి. మరి అక్కడ బ్రేక్ అవ్వాలి అంటే ఏదో ఒక మ్యాజిక్ జరగాలి.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు