Manjummel Boys : మలయాళంలో కొత్త ఇండస్ట్రీ హిట్..

మలయాళంలో ఈ ఏడాది వరుస బెట్టి సినిమాలు హిట్టవుతున్నాయి. తెలుగులో సంక్రాంతి తరవాత ఆ రేంజ్ లో మళ్ళీ హిట్టు బొమ్మ పడలేదు. అటు హిందీ, తమిళ్ లో కూడా ఓ మోస్తరు విజయాలే నమోదయ్యాయి. కానీ మలయాళంలో మాత్రం వారానికో హిట్టు లేదా బ్లాక్ బస్టర్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేస్తున్నాయి మలయాళం సినిమాలు. మొన్న భ్రమయుగం, నిన్న మంజుమ్మేల్ బాయ్స్, నేడు ప్రేమలు. ఇక ఈ సినిమాలన్నీ లౌ బడ్జెట్ సినిమాలే కావడం విశేషం. ఏ అంచనాలు లేకుండా వచ్చిన భ్రమయుగం ఏకంగా 70 కోట్ల వసూళ్ళని అందుకుని బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక లేటెస్ట్ గా ప్రేమలు సినిమా చిన్న సినిమా గా రిలీజ్ అయి ఏకంగా 100 కోట్ల వసూళ్ళని అందుకుని సెన్సేషనల్ హిట్ అయింది. ఇంకా మలయాళంతో పాటు ఇటు తెలుగులో కూడా తెగ ఆడిస్తుంది ఈ సినిమా. తాజాగా ఒక సినిమా అక్కడ ఏకంగా ఇండస్ట్రీ హిట్ అయ్యి కూర్చుంది. ఆ సినిమాయే మంజుమ్మేల్ బాయ్స్.

అన్ సీజన్లో ఇండస్ట్రీ హిట్..

మామూలుగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫిబ్రవరి ,మార్చ్ లాంటి నెలలను అన్ సీజన్ గా భావిస్తారు. ఇలాంటి సీజన్ లో సినిమాలు హిట్ అవ్వడమే ఎక్కువ అని చెప్పాలి. కానీ బ్లాక్ బస్టర్ అవ్వడం అనేది చాలా అరుదు. అయితే ఏకంగా ఇండస్ట్రీ రికార్డులను నమోదు చేయడం అన్నది మాత్రం బిగ్గెస్ట్ రికార్డ్ అనే చెప్పాలి. అది కూడా మలయాళంలో. గత నెల ఫిబ్రవరి లో రిలీజ్ అయిన మలయాళ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ మంజుమ్మేల్ బాయ్స్ సంచలనం సృష్టిస్తూ దుమ్ము లేపే రికార్డులను నమోదు చేసింది.
ఒక చిన్న సినిమా గా బాక్స్ ఆఫీస్ బరిలో నిలిచి మెల్లిమెల్లిగా లాంగ్ రన్ లో సూపర్ కలెక్షన్లు సాధిస్తూ, ఇప్పుడు ఏకంగా ఇండస్ట్రీ హిట్ అయింది. మలయాళం తరపున లాస్ట్ ఇయర్ ఇండస్ట్రీ హిట్ అయిన 2018 మూవీ టోటల్ రన్ కలెక్షన్స్ ని బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. ఆ సినిమా టోటల్ రన్ లో 178 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా ఇప్పుడు మంజుమ్మేల్ బాయ్స్ సినిమా రీసెంట్ కలెక్షన్స్ తో ఈ మమ్మోత్ ఇండస్ట్రీ రికార్డ్ ను బ్రేక్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 180 కోట్ల మార్క్ ని దాటేసింది.

- Advertisement -

200 కోట్ల దిశగా..
ఇక మలయాళంలో ఆరు వారాల కింద రిలీజ్ అయిన మంజుమ్మేల్ బాయ్స్ కొత్త ఇండస్ట్రీ హిట్ గా 180 కోట్ల మార్క్ ని దాటి లాంగ్ రన్ లో కేవలం మలయాళం తరపున ఫస్ట్ ఎవర్ 200 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోవడానికి సిద్ధం అవుతూ ఉండటం విశేషం, ఇక మంజుమ్మేల్ బాయ్స్ సినిమా తెలుగు వర్షన్ త్వరలో మార్చి 22న రిలీజ్ కాబోతూ ఉండగా ఇక్కడ ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో అని ట్రేడ్ నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక లాస్ట్ వీక్ మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు తెలుగులో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా ఇక్కడ 5 కోట్లకి పైగా వసూలు చేసి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు