PanIndiaMovies: నెల గ్యాప్ లో ముగ్గురు స్టార్ హీరోల అప్డేట్స్

టాలీవుడ్ ప్రస్తుతం ముగ్గురు పాన్ ఇండియా హీరోల ఫ్యాన్స్ చాలా నిరాశ లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ నుండి సినిమాలు వచ్చి రెండేళ్ల పైనే కావస్తుంది. పైగా వాళ్ళు సెట్స్ పై ఉంచిన సినిమాలు కూడా ఇప్పటివరకూ ఫినిష్ కాలేదు. అన్నిటికి మించి ఆ సినిమాల రిలీజ్ డేట్లు వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. కనీసం ఆ సినిమాల నుండి ఏదో ఒక టీజరో, సాంగో ఇవ్వకుండా ఫ్యాన్స్ ని నిరాశ పరుస్తున్నారు. అన్నిటికి మించి వాళ్ళ తదుపరి సినిమాల అప్డేట్స్ కోసం ఎంతో ఆత్రుత గా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఆ స్టార్ హీరోలు ఎవరో కాదు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టాట్ అల్లు అర్జున్. అవును.. ఈ హీరోల అభిమానులు ప్రస్తుతం తీవ్ర అసహనంలో ఉన్నారు. వీళ్ళ నుండి సినిమా వచ్చి రెండేళ్ల పైనే అయింది. పైగా కొత్త సినిమాల అప్డేట్లు కూడా లేవు. అయితే ఇన్నాళ్లు ఓపిక పట్టిన ఈ హీరోల ఫ్యాన్స్ కి ఇప్పుడు సాలిడ్ అప్డేట్స్ తో ఫ్యాన్స్ కి ఆయా సినిమాల మేకర్స్ కిక్ ఇవ్వబోతున్నారని సమాచారం. ఇక మరొకొన్ని రోజుల్లో వాళ్ళు చేస్తున్న సినిమాలపై ఒక్కో అప్డేట్ లు రానున్నాయి. వాటన్నిటికి ఆ హీరోల బర్త్ డేస్ స్పెషల్ గా మారనున్నాయి. ఈ ముగ్గురు హీరోల బర్త్ డే లు నెల రోజుల గ్యాప్ లో ఉండడం వల్ల వీళ్ళ నెక్స్ట్ సినిమాల అప్డేట్స్ బర్త్ డే స్పెషల్ గా అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. ముందుగా..

రామ్ చరణ్ (మార్చి 27)

పాన్ ఇండియా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ గా ఇప్పటికే గేమ్ ఛేంజర్ నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ రానుందని మేకర్స్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే అదే రోజు గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ కానుందని సమాచారం. ఇక బుచ్చిబాబు తో చేస్తున్న సినిమా టైటిల్ తో సహా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆరోజు రిలీజ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే కాక రామ్ చరణ్ 17వ సినిమాని సుకుమార్ తో చేస్తున్నట్టు ఆరోజు అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ సినిమా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఉండే అవకాశం ఉంది. అలాగే ప్రశాంత్ నీల్ గాని, లోకేష్ కనగరాజ్ తో గాని సినిమా అనౌన్స్ మెంట్ రావచ్చు.

- Advertisement -

అల్లు అర్జున్ (ఏప్రిల్ 08)

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 నుండి లాస్ట్ ఇయర్ టీజర్ తప్ప మళ్ళీ వేరే అప్డేట్ రాలేదు. మహా అయితే అప్పుడపుడు లీక్ అయిన స్టిల్స్ మాత్రమే వచ్చాయి. ఇక ఈ ఇయర్ బన్నీ బర్త్ డే కి పుష్ప నుండి మరో సాలిడ్ టీజర్ ని వదలనున్నారు మేకర్స్. అలాగే సందీప్ రెడ్డి తో అల్లు అర్జున్ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది. దీంతో అట్లీ బన్నీ కాంబోలో కూడా సినిమా వస్తుందని వార్తలు వస్తున్నాయి. అన్నీ కుదిరితే ఈ కాంబినేషన్ అనౌన్స్ మెంట్ కూడా రావచ్చు.

జూనియర్ ఎన్టీఆర్ (మే 20)

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుండి కూడా టీజర్ తప్ప మరే అప్డేట్ రాలేదు. ఇక ఎన్టీఆర్ బర్త్ డే సందర్బంగా దేవర నుండి మరో టీజర్ లేదా సాంగ్ గాని రావచ్చు. అలాగే ఎన్టీఆర్ తదుపరి ప్రాజెక్ట్ లు ప్రశాంత్ నీల్, లేదా త్రివిక్రమ్ కాంబో లో అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు రిషబ్ శెట్టి తో కూడా మూవీ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. ఇక ప్రస్తుతం ఈ ముగ్గురి హీరోల ఫ్యాన్స్ ఫోకస్ అంతా బర్త్ డే ల పైనే ఉంది.

Check Filmify Telugu for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు