OmBheemBush Trailer Talk : అల్ ప్రాబ్లెమ్స్ వన్ సొల్యూషన్..

టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం “ఓం భీం బుష్”. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడే ఈ సినిమా పక్కా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుందని తెలిసింది. ఇక ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ ఆడియన్స్ ని మెప్పించి సినిమాపై మంచి అంచనాలను పెంచేసింది. హుషారు తో మంచి హిట్టు కొట్టిన హర్ష కొనుగంటి ఈ సినిమాను డైరెక్ట్ చేయడం జరిగింది. మార్చి 22న సినిమా రిలీజ్ కి రెడీ అవుతుండగా, లేటెస్ట్ గా ఓం భీం బుష్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఈ ట్రైలర్ కూడా రిలీజ్ అయిన కాసేపటికే యూట్యూబ్ లో ట్రెండింగ్ లోకి వచ్చింది.

ట్రైలర్ కథ విషయానికి వస్తే..

ఓం భీం బుష్ సినిమా ట్రైలర్ కాసేపటికిందే యూట్యూబ్ లో రిలీజ్ కాగా, ఈ సినిమా ట్రైలర్ ని గమనించగా, ఈ సినిమా భైరవపురం ఊరు నేపథ్యంలో గుప్త నిధుల కోసం జరిగే ఓ కామెడీ డ్రామా అని తెలుస్తుంది. ఇక ట్రైలర్ మొత్తం కామెడీ తో ఆద్యంతం నవ్వించేలా ఉంది. ఇక ఈ సినిమా ఒక కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తుంది. ట్రైలర్ లో అక్కడక్కడా వేసిన పంచులు కూడా చాలా హిలేరియస్ గా ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ఈ ముగ్గురు హీరోలు బ్యాంగ్ బ్రోస్ టీమ్ పేరుతో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా లో ముగ్గురు ఫ్రెండ్స్ ఒక గ్రామానికి వెళ్లి అక్కడి ఊరి వాళ్ళని బురిడీ చేసి జల్సాలు చేస్తుంటే, అనుకోకుండా వీరికి పెద్ద చిక్కు వచ్చిపడుతుంది. ఆ ఊళ్ళో వాళ్ళు ఒక పాడు బడ్డ బంగాళా లో నిధులు ఉన్నాయి వాటిని తీసుకురమ్మని పంపుతారు. ఆ తర్వాత జరిగిన కథేంటి అనేది సినిమాలో చూడాలి.

- Advertisement -

కామెడీ ప్రధాన బలం..

ఇక ఓం భీమ్ బుష్ ట్రైలర్ చూసాక అందరికి తెలిసిన ఒక మామూలు స్టోరీని తన కామెడీ డ్రామాతో స్క్రీన్ ప్లే తో మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు. ఇక పక్కా కామెడీ డ్రామాతో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే మినిమం గ్యారెంటీ అని, కామెడీ చిత్రాల ఆడియన్స్ ని మెప్పించడం అయితే గ్యారెంటీ అనిపిస్తుంది. ఇక తన సినిమాలతో మినిమం గ్యారెంటీ అంటూ మెప్పిస్తున్న శ్రీవిష్ణు సామజవరగమన తర్వాత చేస్తున్న మూవీ అవడంతో ఓం భీం బుష్ సినిమాపై క్రేజీ బజ్ ఏర్పడింది. ఇక ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కూడా తమ మార్క్ తో అలరించబోతున్నారని తెలుస్తుంది. ఇక మార్చి 22న రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాను వి సెల్యులాయిడ్ బ్యానర్ లో సునీల్ బలుసు నిర్మించాడు. అయేషా ఖాన్ హీరోయిన్ గా నటించింది. మరి సినిమా కంటెంట్ బాగుంటే ‘ఓం భీం బుష్’ మండు వేసవిలో చల్లని చిరునవ్వులు కురిపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు