Faria Abdulla : పెళ్లికి సిద్ధమైన చిట్టి… వరుడు ఎవరంటే?

“జాతిరత్నాలు” మూవీతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న హైదరాబాదీ అమ్మాయి ఫరియా అబ్దుల్లా. తాజాగా ఈ బ్యూటీ తన ఫ్యాన్స్ నెత్తిపై పిడుగు పడే డెసిషన్ తీసుకుందని తెలుస్తోంది. ఎవ్వరూ ఊహించని విధంగా పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అయ్యిందట. ఫరియా బ్యాచిలర్ లైఫ్ కు బైబై చెప్పేసి పెళ్లి బంధంలోకి అడుగు పెట్టబోతోంది అనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. మరి ఇంతకీ ఆమెను పెళ్లాడబోయే వరుడు ఎవరంటే?…

ఫరియాకు కాబోయే భర్త ఎవరు అంటే?
మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ ఫరియా ట్యాలెంట్ కు తగ్గ అవకాశాలు రావట్లేదు. దీంతో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా పెళ్లి బంధంలోకి అడుగు పెట్టడానికి రెడీ అయ్యిందట ఈ హైదరాబాదీ అమ్మాయి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. మరి ఆమెను పెళ్లాడబోయే ఆ అదృష్టవంతుడు ఎవరు అంటే… చిట్టి తన చిన్న నాటి స్నేహితుడిని పెళ్లి చేసుకోబోతోంది అని జోరుగా ప్రచారం నడుస్తోంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఫరియాకు కాబోయే భర్త కూడా ఇండస్ట్రీకి చెందినవాడే అని అంటున్నారు. ఒక షార్ట్ ఫిల్మ్ లో అతను హీరోగా నటిస్తున్నాడు అనే టాక్ నడుస్తోంది. కానీ సిల్వర్ స్క్రీన్ హీరోయిన్ అయిన ఈ బ్యూటీ షార్ట్ ఫిల్మ్ లో నటించే అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది అనేదే తేడా కొడుతోంది. మరి ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియాలంటే ఫరియా స్పందించాల్సిందే.

ఫరియాకు నో ఛాన్సుల్లేవ్…
2021లో జాతి రత్నాలు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఫరియాకు అవకాశాలు మాత్రం కలిసిరాట్లేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, బంగార్రాజు సినిమాల్లో క్యామియో రోల్స్ చేసింది. ఆ తరువాత “రావణాసుర” మూవీలో హీరోయిన్ గా నటించినప్పటికీ యూజ్లెస్ గా మిగిలింది. ఆ మూవీ డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఫరియా చేతిలో “ఆ ఒక్కటీ అడక్కు” అనే తెలుగు మూవీ మాత్రమే ఉంది. మరో తమిళ సినిమా తప్ప ఫరియాకు వేరే అవకాశాలు లేవు.

- Advertisement -

ఫరియాకు హైటే శాపమా?
ఫరియాకు అందం, అభినయం రెండూ కావలసినంత ఉన్నాయి. గ్లామర్ పాత్రలు చేయడానికి కూడా రెడీ అంటూ కొన్ని ఫోటోషూట్ ల ద్వారా సిగ్నల్స్ ఇచ్చింది. అలాగే డి గ్లామర్ రోల్ అయినా సరే అదరగొట్టడానికి రెడీ అని రీసెంట్ గా రిలీజ్ అయిన “ది జంగబురు కర్స్” అనే వెబ్ సిరీస్ ద్వారా వెల్లడించింది. కానీ మేకర్స్ కళ్ళు మాత్రం ఈ అమ్మడిపై ఇంకా పడట్లేదు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల విషయంలో ఎలాంటి కరువు ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉన్న ఇద్దరు ముగ్గురు హీరోయిన్లనే వాడేస్తున్నారు మేకర్స్. ఒక్కొక్క హీరోయిన్ దాదాపు చేతిలో అరడజన్ సినిమాలతో బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఇక సీనియర్ హీరోలు త్రిష, నయనతార వంటి సీనియర్ హీరోయిన్లతో మరోసారి జోడి కట్టడానికి రెడీ అవుతున్నారు. యంగ్ హీరోలు అసలు ఫరియా వైపు కనీసం కన్నెత్తి చూడట్లేదు. నిజానికి దీనంతటికీ కారణం ఆమె హైట్. ఫరియా హైటే ఆమెకు శాపమైంది అని అంటూ ఉంటారు. ప్రభాస్ కటౌట్ కు తగ్గ హైట్ ఉంటుంది ఫరియా. ఈ అమ్మడి హైట్ ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోల కంటే చాలా ఎక్కువే. అందుకేనేమో మంచి స్కిల్స్, గ్లామర్ ఉన్నప్పటికీ ఆమెకు అవకాశాలు మాత్రం రావట్లేదు. ఈ నేపథ్యంలోనే పెళ్లి రూమర్స్ మొదలయ్యాయి.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు