Faria Abdullah: పెళ్లి చేసుకోబోతున్న ఫరియా అబ్దుల్లా.. ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించాలంటే ఎంతో టాలెంట్ ఉండాలి. లేకపోతే ఎక్స్పోజింగ్ అయినా ఉంటే సరిపోతుంది. ఈ రెండు లేకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణించడం చాలా కష్టం. అయితే… కొంతమంది హీరోయిన్లు మాత్రం తమ మొట్టమొదటి సినిమాతో పాపులర్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత కెరీర్ పై దృష్టి పెట్టకుండా లైట్ తీసుకుంటారు. దీంతో వాళ్లకు అస్సలు చాన్సులు రావు. ఇంకేముంది టాలీవుడ్ ఇండస్ట్రీలో… ఫెయిల్యూర్ ముద్ర వేసేస్తారు. ఆ తర్వాత చాన్సుల కోసం నిర్మాతల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అలాంటి హీరోయిన్లలో ఫరీయా అబ్దుల్లా ఒకరు.

జాతి రత్నాలతో… మెరిసిన ఫరియా

టాలీవుడ్ ఇండస్ట్రీలో… హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గురించి ఎంత చెప్పినా తక్కువవుతుంది. జాతి రత్నాలు సినిమాతో ఓవర్ నైట్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది ఫరియా అబ్దుల్లా. జాతి రత్నాలు సినిమాలో అమాయకమైన అమ్మాయిగా చిట్టి పాత్రలో అద్భుతంగా నటించి టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. ఆ సినిమా తర్వాత ఫరియా అబ్దుల్లా కెరీర్ పెద్దగా దూసుకు వెళ్లలేదు. అందరూ అనుకున్న విధంగా పెద్దగా ఆమెకు ఛాన్సులు రాలేదు. చాన్సులు వచ్చిన చిన్న చిన్న సినిమాలలో మాత్రమే వచ్చాయి. కానీ జాతి రత్నాలు సినిమా మాత్రం ఫరియా అబ్దుల్లాకు మంచి క్రేజీ ఇచ్చిందని చెప్పవచ్చు.

- Advertisement -

ఒక్క సినిమాతోనే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది ఈ బ్యూటీ. అంతేకాకుండా అక్కినేని నాగార్జున మరియు అక్కినేని నాగచైతన్య కలిసి నటించిన బంగార్రాజు సినిమాలో ఓ స్పెషల్ సాంగులో కూడా మెరిసింది ఈ బ్యూటీ. అటు ఇటీవల రవితేజ హీరోగా రావణాసుర సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించింది ఫరియా అబ్దుల్లా. ఈ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ కావడంతో..

ఫరియా అబ్దుల్లాకు నిరాశే ఎదురైంది.

సోషల్ మీడియాలోనూ జోష్

జాతి రత్నాలు సినిమా తర్వాత మంచి విజయం లేకపోవడంతో… తన అందాలను చూపించడం మొదలు పెట్టేసింది హీరోయిన్ ఫరీయాఅబ్దుల్లా. నిత్యం సోషల్ మీడియాలో తన అంద చందాలను అరబోస్తూ… తెలుగు యువతకు దగ్గరవుతోంది. ఎవరు కూడా ఆమెను మర్చిపోకుండా అందచందాలను ఆడబోస్తోంది.

పెళ్లి పీటలు ఎక్కువ పోతుందా ?

ఈమధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు సెలబ్రిటీలు. గత ఏడాది శర్వానంద్ మరియు నాగశౌర్య పెళ్లి చేసుకోగ… ఈ మధ్యకాలంలో రకుల్ ప్రీత్ కూడా పెళ్లి చేసేసుకుంది. త్వరలోనే కిరణ అబ్బవరం, సిద్దు జొన్నలగడ్డ పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఫరియా అబ్దుల్లా కూడా షార్ట్ ఫిలిం హీరోను పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందట.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు