Puneeth Rajkumar: తెరపై స్టార్ హీరో.. కన్నీళ్లు పెట్టుకున్న భార్య..!

కన్నడలో పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న దివంగత నటుడు స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ 1975 మార్చి 17న చెన్నై తమిళనాడులో జన్మించారు.. ఇక ఈయన పుట్టినరోజు సందర్భంగా ఈయన నటించిన జాకీ సినిమా కర్ణాటకలో భారీగా రీరిలీజ్ కాబోతోంది. ఈ చిత్రాన్ని..KGR స్టూడియో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 120 కి పైగా థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈయన అభిమానుల కోరిక మేరకు జాకీ చిత్రాన్ని ఈ రోజున థియేటర్ లలో ప్రదర్శించారు..

జాకీ రీ రిలీజ్..
పునీత్ రాజ్ కుమార్ మరణించిన తర్వాత ఆయన నుంచి రీ రిలీజ్ అయిన తొలి సినిమా జాకీ కావడంతో చాలావరకు థియేటర్ లు హౌస్ ఫుల్ తో నిండిపోయాయి. ముఖ్యంగా తెల్లవారుజామున 4:30 నిమిషాల నుంచి జాకీ స్పెషల్ షో లు వేశారు.. అభిమానులతో పాటు ఈ చిత్రాన్ని చూసేందుకు పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని కూడా వెళ్లారు.. వెండితెర పైన తన భర్తను చూసి ఒక్కసారిగా ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

తెరపై భర్తను చూసి అశ్విని కన్నీరు..
తెరపై కనిపిస్తున్న పునీత్ రాజ్ కుమార్ ను చూసి.. కొన్ని సందర్భాలలో అశ్విని కన్నీరు కూడా పెట్టుకున్నట్లు కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. అశ్వినితో పాటు పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు కూడా ఈ చిత్రాన్ని చూడడం జరిగింది.. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు

- Advertisement -

జాకీ సినిమా..
దునియా సూరి డైరెక్షన్లో 2010లో వచ్చిన ఈ జాకీ సినిమా కన్నడ ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్టర్ గా మిగిలిపోయింది.. పునీత్ రాజకుమార్ నటించిన బెస్ట్ సినిమాలలో ఇది కూడా ఒకటిగా నిలవడం గమనార్హం. పునీత్ రాజ్ కుమార్ కెరియర్ లోనే ఒక మైలురాయిగా ఈ సినిమా నిలిచింది.. అందుకే పునీత్ రాజ్ కుమార్ మరణించిన తర్వాత మొట్టమొదటి రీ రిలీజ్ చిత్రంగా జాకీ సినిమాని విడుదల చేశారని తెలుస్తోంది. ఇందులో పునీత్ రాజ్ కుమార్ సరసన భావన హీరోయిన్గా నటించింది.

పునీత్ రాజ్ కుమార్..
పునీత్ రాజ్ కుమార్ హీరో గానే కాకుండా ఎంతో మందికి సహాయం చేసి మంచి వ్యక్తిగా కూడా గుర్తింపు పొందారు.. 1976 లోని బాల నటుడిగా కెరియర్ ప్రారంభించిన ఈయన బాలనటుడిగా ఏకంగా 13 సినిమాలు చేసి ఉత్తమ బాల నటుడిగా జాతీయ అవార్డులను కూడా అందుకున్నారు..ఇక 2002లో అప్పు సినిమాతో హీరోగా పరిచయమై తన 45 ఏళ్ల సినీ జీవితంలో 32 సినిమాలలో నటించారు పునీత్ రాజ్ కుమార్..

పునీత్ రాజ్ కుమార్ సేవా కార్యక్రమాలు..
పునీత్ రాజ్ కుమార్ 45 ఉచిత పాఠశాలలను ఏర్పాటు చేసి.. 1800 మంది విద్యార్థులకు చదువు చెప్పించడమే కాకుండా 26 అనాధ ఆశ్రమాలు.. 16 వృద్ధాశ్రమాలు అలాగే 19 గోశాలలను కూడా ఏర్పాటు చేసి వాటిని నిర్వహించారు..

పునీత్ రాజ్ కుమార్ మరణం.
.2021 అక్టోబర్ 29న వ్యాయామం చేస్తూ అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో హుటాహుటిన బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అక్కడికక్కడే ఆయన తుది శ్వాస విడిచారు.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు